Mahindra Group Chairman Gave Super Opportunity To Street Performer Of Delhi Tweet Goes Viral- Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌పై బిచ్చగాడి డ్యాన్స్‌.. ఆనంద్‌ మహీంద్రా ఫిదా.. వెంటనే గొప్ప అవకాశం

Published Tue, Jan 4 2022 1:11 PM | Last Updated on Tue, Jan 4 2022 1:45 PM

Anand Mahindra Gave Super Opportunity To Street Performer Of Delhi - Sakshi

వేల కోట్ల బిజినెస్‌తో నిత్యం బిజీగా ఉంటూనే సమకాలిన అంశాలపై స్పందిస్తుంటారు ఆనంద్‌ మహీంద్రా. అంతేకాదు అవకాశాలు రాక.. గుర్తింపుకు నోచుకోకుండా మరుగున పడిపోయిన ప్రతిభను సోషల్‌ మీడియా వేదికగా పట్టుకుంటారు. ఈ లోకల్‌ టాలెంట్‌ని ప్రశంసలతోనే వదిలేయకుండా అద్భుతమైన అవకాశాలను కల్పించడం ఆయన ప్రత్యేకత. తాజాగా ఓ స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌ ఆయన కంట పడ్డాడు. అతని దశ తిరిగే ఆఫర్‌ ఇచ్చారు ఆనంద్‌ మహీంద్రా.

కన్నాట్‌ప్లేస్‌.. కళాకారుడు
హర్యాణాకి చెందిన వరుణ్‌ యువకుడికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. శబ్ధానికి తగ్గట్టుగా నర్తించడం అంటే ఇష్టం. కానీ అదే అతనికి కష్టాలను కొని తెచ్చింది. సంగీతం, డ్యాన్సులంటూ పని చేయకుండా పరువు తీస్తున్నాడని ఉన్న ఊరూ, కన్న తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో.. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వచ్చేశాడు. అక్కడ కన్నాట్‌ ప్లేస్‌లో ఫుట్‌పాత్‌పై తన కళను ప్రదర్శిస్తూ బతికేస్తున్నాడు.

ఆ స్టోరీతో వెలుగులోకి
సంగీతం, డ్యాన్సుల మీద ప్రేమతో నిత్యం కన్నాట్‌ ప్లేస్‌లో ఫుట్‌పాత్‌లపై స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌గా వరుణ్‌ ప్రదర్శనలు ఇచ్చేవాడు. బిచ్చగాడిగా భావించిన పోలీసులు బెదిరించే వారు మరికొందరు అరకొర చిల్లర విదిల్చేవారు. వాటితో కడుపు నిండకపోయినా కళను వదిలేయలేదు. కొన్నాళ్లకి అతని కళకి గుర్తింపు వచ్చింది. క్రమంగా ఆ స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌కి అభిమానులు పెరిగారు. ఓ జాతీయ మీడియా సైతం వరుణ్‌పై చిన్న కథనం ప్రసారం చేసింది.

ఆనంద్‌ ప్రశంసలు
‍స్ట్రీట్‌ పెర్ఫార్మర్‌ ప్రతిభకు ముగ్ధుడయ్యాడు ఆనంద్‌ మహీంద్రా. డ్యాన్స్‌లో మనందరం భాగమే. డ్యాన్స్‌ ద్వారా నీ భావ వ్యక్తీకరణను ఇకపై ఎవ్వరూ ఆపలేరు. అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. జాతీయ మీడియా ప్రసారం చేసిన వీడియోను ట​​​​​‍్విట్టర్‌లో షేర్‌ చేశారు.

బాలీవుడ్‌కి బాటలు ?
వరుణ్‌ డ్యాన్స్‌కి పాటకి ముగ్ధుడై ప్రశంసలతోనే వదిలేయలేదు ఆనంద్‌మహీంద్రా. వరుణ్‌ ప్రతిభకి సరైన వేదిక కల్పించే పనిలో పడ్డారు. మహీంద్రా గ్రూపు కల్చరల్‌ విభాగం హెడ్‌ జయ్‌ ఏ షాని లైన్‌లో తీసుకున్నారు. ఢిల్లీలో మహీం‍ద్రా గ్రూపు ఏర్పాటు చేసే కల్చరల్‌ ఈవెంట్స్‌లో వరుణ్‌ ప్రోగ్రామ్‌ ఉండేలా చూడమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏనాటికైనా బాలీవుడ్‌లో అడుగు పెట్టాలనే వరుణ్‌ కల ఆనంద్‌ మహీంద్రా తోడ్పాటుతో నిజం కావాలని ఆశిద్దాం. 

చదవండి: పేద కమ్మరికి బొలెరో ఆఫర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement