అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రామగిరి : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసినందున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా ప్రీపేర్ కావాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పిలుపునిచ్చారు.
రామగిరి : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసినందున నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా ప్రీపేర్ కావాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో గ్రూప్ స్థాయి ఉద్యోగాల ప్రకటన ఎన్నడూ వెలుబడలేదని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు తాగు, సాగునీటిలపై, ఉద్యోగాలపై చేస్తున్న విమర్శలు అసత్యాలను పేర్కొన్నారు. త్వరలో 5వేల గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వెలుబడనుందని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, మేడబోయిన వెంకన్న, బాషబోయిన లింగస్వామి, పెరిక దివాకర్, కొంపెల్లి సత్యనారాయణ, వెంకన్న, కుమార్‌నాయక్ తదితరులున్నారు.