
చెన్నై : తమిళనాడు రాష్ర్టంలో కరోనా కట్టడి దృష్ట్యా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. గురువారం చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీలో కంపల్సరీ రోటరీ రెసిడెన్షియల్ ఇంటర్న్‌షిప్ ( సిఆర్‌ఆర్‌ఐ)ఇంటర్న్‌లుగా సేవలందిస్తున్న ఏడుగురు వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో వీరందరిని క్వారంటైన్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ర్టంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత కొంత కాలంగా విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రొటేషన్ పద్ధతిలో ఒక్కో హాస్పిటల్‌లో సేవలందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలువురు వైద్య విద్యార్థులు కోవిడ్ బారిన పడుతున్నారు.ఇటీవలె మద్రాస్ మెడికల్ కాలేజీ , రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ కిల్‌పాక్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఒమండురార్ ఎస్టేట్ కాలేజీ వైద్య విద్యార్థులకు కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. వీరి పరీక్షా ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. (సినీ నటుల ఇళ్ల వద్ద కరోనా కలకలం )
తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన నమోదైన మొత్తం కేసుల సంఖ్య 70,000 దాటగా, చెన్నైలోనే 47,640 కేసులు నమోదయ్యాయి. భారత్‌నా కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా 17,296 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలకు చేరువలో ఉంది. ప్రస్తుతం 1,89,463 యాక్టివ్ కేసులున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. (కేంద్రమంత్రి ఫన్నీ మీమ్స్ )
Comments
Please login to add a commentAdd a comment