ఇలా చేస్తే.. హార్లీ డేవిడ్సన్‌ మీ సొంతం! | Harley-Davidson Offers Bike Free For 12 Weeks Internship | Sakshi
Sakshi News home page

ఇలా చేస్తే.. హార్లీ డేవిడ్సన్‌ మీ సొంతం!

Published Wed, Apr 25 2018 12:06 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

Harley-Davidson Offers Bike Free For  12 Weeks Internship - Sakshi

హార్లీ డేవిడ్సన్‌ బైక్‌

న్యూఢిల్లీ : ప్రముఖ బైక్‌ల కంపెనీ హార్లీ డేవిడ్సన్‌ గొప్ప బంపర్‌ ఆఫర్‌ని ప్రకటించింది. హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ని ఉచితంగా పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అందుకోసం చేయాల్సిందల్లా ఈ వేసవిలో హార్లీ డేవిడ్సన్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేస్తే చాలు. 12వారాల (దాదాపు మూడునెలలు) ఇంటర్నషిప్‌లో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ను ఇస్తారు. అభ్యర్థులు చేయాల్సిందల్లా ఈ బైక్‌ల మీద విహరించి  తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలి. వాటిల్లో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసి, విజేతకు కళ్లు చెదిరే బహుమతి ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంతకు బహుమతి ఏంటంటే....గెలుపొందిన వారికి హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.

ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు బైక్‌ని ఎలా నడపాలి అనే విషయంలో శిక్షణ ఇవ్వడమే కాక వారికి ప్రయాణ ఖర్చులతో పాటు వేతనాన్ని కూడా చెల్లించనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. అంతేకాక అభ్యర్థులు ఈ 12 వారాలపాటు బైక్‌ను తమతో పాటు ఉంచుకునే అవకాశం కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ 12 వారాల ప్రయాణంలో అభ్యర్థులు తమ అనుభవాలను, ఫోటోలను, ఫన్ని వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవాలి. వాటిలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసి వారికి హార్లీ డేవిడ్సన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

దరఖాస్తు చేసుకునేందుకు...
సృజనాత్మకత కలిగిన 18 ఏళ్లు నిండిన పట్టభద్రులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో ‘స్వేచ్ఛ’కు మీరు ఇచ్చే నిర్వచనం ఏంటో తెలిపేలా ఒక వ్యాసాన్ని కానీ, ఫోటో గాలరీని కానీ, వీడియోను కానీ తయారు చేసి FreedomInternship@Harley-Davidson.comకు పంపించాలని తెలిపింది. వాటిల్లో నుంచి తమకు కావల్సిన అభ్యర్థులను ఇంటర్న్‌షిప్‌ కోసం తీసుకుంటామని కంపెనీ అధికారులు తెలిపారు. దరఖాస్తులకు చివరి తేది 2018, మే 11.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement