Harley-Davidson Company
-
సరసమైన ధరలో హార్లే డేవిడ్సన్ నుంచి సూపర్ ఎలక్ట్రిక్ బైక్...!
అమెరికాకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ త్వరలోనే మరో ఎలక్ట్రిక్ బైక్ తీసుకురానుంది. లైవ్‌వైర్ బ్రాండ్ కింద మార్కెట్లోకి రానుంది. ఈ బైక్ ను S2 Del Marగా పిలవనున్నారు. మిడ్ వెయిట్ విభాగంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మిడిల్-వెయిట్ విభాగంలోకి వస్తుంది. యారో ఆర్కిటెక్చర్‌తో కూడిన ఈ బైక్‌లో ముఖ్యమైన భాగాలు బ్యాటరీ, ఇన్వర్టర్, ఛార్జర్, స్పీడ్ కంట్రోలర్, మోటార్ వంటివి ఎలక్ట్రిక్ బైక్ మోడల్‌కి సంబంధించినవే ఉంటాయి. కాగా ఈ బైక్ లో మాత్రమే నూతనంగా యారో ఆర్కిటెక్చర్ టెక్నాలజీ రానుంది. టెస్లా, శాంసంగ్ లాంటి.. యారో ఆర్కిటెక్చర్ ద్వారా 21,700 రకాల సిలిండ్రికల్ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్‌ను ఎలక్ట్రిక్ బైక్ కోసం హార్లే డేవిడ్సన్ ఉపయోగిస్తోంది. ఇదే ఫార్మాట్‌ను టెస్లా, శాంసంగ్ వంటి కంపెనీలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఎస్2 డెల్ మార్ మిడిల్ వెయిట్ విభాగానికి చెందినదే అయినప్పటికీ... ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా లైటర్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కూడా తయారుచేస్తారు. హార్లే డేవిడ్సన్ లైవ్‌వైర్ ఇప్పటికే తైవాన్‌కి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ Kymcoతో టైఅప్ అయింది. భవిష్యత్తులో ఈ రెండు సంస్థలు కలిసి యారో ఆర్కిటెక్చర్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నాయి.కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఈ ఏడాది జూన్-ఏప్రిల్ మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాగా ఈ బైక్ సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరసమైన ధరకు ఈ బైక్ అందుబాటులో వుంటుందని తెలుస్తోంది. -
భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా నుంచి భారత్‌కు దిగుమతవుతున్న హార్లే డేవిడ్సన్ బైక్‌లపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఈ సుంకం వంద శాతంగా ఉండగా, నరేంద్ర మోదీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సంతృప్తి చెందని ట్రంప్ బైక్ ధరలో దాదాపు సగం సుంకాలే ఉన్నాయని, ఇది అంగీకారయోగ్యం కాదని విమర్శించారు. జపాన్‌లోని ఒసాకాలో ఈ నెల 28–29 మధ్య జీ20 సమావేశంలో మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రతి దేశంతో సంబంధాలను ఆర్థిక దృష్టితో మాత్రమే చూసే డొనాల్ట్ ట్రంప్, భారత్‌ను టారిఫ్ కింగ్‌గా అభివర్ణించారు. భారత ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆయన హెచ్చరించారు. హార్లే డేవిడ్సన్ బైక్‌లపై ప్రస్తుతం విధిస్తున్న 50 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతయ్యే బైక్‌లపై విధిస్తున్న సుంకాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సుంకాల విషయమై సుదీర్ఘకాలంగా అమెరికా దోపిడీకి గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య లోటు 80,000 కోట్ల డాలర్ల మేర ఉందని పేర్కొన్నారు. చైనా తర్వాత ట్రంప్ తదుపరి లక్ష్యం భారతేనని అమెరికా మీడియా భావిస్తోంది. ఈ–కామర్స్, డేటా లోకలైజేషన్‌పై భారత్ ఆంక్షలు అమెరికా కంపెనీలపై బాగా నే ప్రభావం చూపాయని, ఇది భారత్‌లో అమెరికా కంపెనీల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపనుందని వైట్‌హౌస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
ఇలా చేస్తే.. హార్లీ డేవిడ్సన్ మీ సొంతం!
న్యూఢిల్లీ : ప్రముఖ బైక్‌ల కంపెనీ హార్లీ డేవిడ్సన్ గొప్ప బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. హార్లీ డేవిడ్సన్ బైక్‌ని ఉచితంగా పొందే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అందుకోసం చేయాల్సిందల్లా ఈ వేసవిలో హార్లీ డేవిడ్సన్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తే చాలు. 12వారాల (దాదాపు మూడునెలలు) ఇంటర్నషిప్లో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు హార్లీ డేవిడ్సన్ బైక్‌ను ఇస్తారు. అభ్యర్థులు చేయాల్సిందల్లా ఈ బైక్‌ల మీద విహరించి తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేయాలి. వాటిల్లో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసి, విజేతకు కళ్లు చెదిరే బహుమతి ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇంతకు బహుమతి ఏంటంటే....గెలుపొందిన వారికి హార్లీ డేవిడ్సన్ బైక్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు బైక్‌ని ఎలా నడపాలి అనే విషయంలో శిక్షణ ఇవ్వడమే కాక వారికి ప్రయాణ ఖర్చులతో పాటు వేతనాన్ని కూడా చెల్లించనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. అంతేకాక అభ్యర్థులు ఈ 12 వారాలపాటు బైక్‌ను తమతో పాటు ఉంచుకునే అవకాశం కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ 12 వారాల ప్రయాణంలో అభ్యర్థులు తమ అనుభవాలను, ఫోటోలను, ఫన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలి. వాటిలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసి వారికి హార్లీ డేవిడ్సన్ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు... సృజనాత్మకత కలిగిన 18 ఏళ్లు నిండిన పట్టభద్రులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో ‘స్వేచ్ఛ’కు మీరు ఇచ్చే నిర్వచనం ఏంటో తెలిపేలా ఒక వ్యాసాన్ని కానీ, ఫోటో గాలరీని కానీ, వీడియోను కానీ తయారు చేసి FreedomInternship@Harley-Davidson.comకు పంపించాలని తెలిపింది. వాటిల్లో నుంచి తమకు కావల్సిన అభ్యర్థులను ఇంటర్న్‌షిప్ కోసం తీసుకుంటామని కంపెనీ అధికారులు తెలిపారు. దరఖాస్తులకు చివరి తేది 2018, మే 11. -
హర్లే డేవిడ్సన్.. తొలి ఎలక్ట్రిక్ బైక్
న్యూఢిల్లీ: హర్లే డేవిడ్సన్ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.. లైవ్‌వైర్‌ను ఆవిష్కరించింది. ఇది అమ్మకానికి కాదని, వినియోగదారులకు అవగాహన కలిగించడానికేనని కంపెనీ ప్రెసిడెంట్, సీఓఓ మ్యాట్ లెవటిచ్ చెప్పారు. వచ్చే వారం నుంచి ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ బైక్‌ను నడిపే అవకాశాన్నిస్తామని పేర్కొన్నారు. వారి నుంచి సేకరించే అభిప్రాయాల ఆధారంగా తమ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను మరింత పటిష్టంగా రూపొందిస్తామని వివరించారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, అవసరాలకనుగుణంగా ఎప్పటికప్పుడు బైక్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే ప్రాజెక్ట్ రష్మోర్ టూరింగ్ బైక్‌లు, హర్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 500, 750 మోడళ్లను అందించామన్నారు. గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే ఈ బైక్ 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని(గంటకు) 4 సెకన్లలో అందుకుంటుంది. 210 కిమీ. ప్రయాణం తర్వాత బ్యాటరీలను రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. రీచార్జ్ సమయం అరగంట నుంచి గంట వరకూ ఉంటుంది.