అమెరికాకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్ త్వరలోనే మరో ఎలక్ట్రిక్ బైక్ తీసుకురానుంది. లైవ్‌వైర్ బ్రాండ్ కింద మార్కెట్లోకి రానుంది. ఈ బైక్ ను S2 Del Marగా పిలవనున్నారు.
మిడ్ వెయిట్ విభాగంలో
ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మిడిల్-వెయిట్ విభాగంలోకి వస్తుంది. యారో ఆర్కిటెక్చర్‌తో కూడిన ఈ బైక్‌లో ముఖ్యమైన భాగాలు బ్యాటరీ, ఇన్వర్టర్, ఛార్జర్, స్పీడ్ కంట్రోలర్, మోటార్ వంటివి ఎలక్ట్రిక్ బైక్ మోడల్‌కి సంబంధించినవే ఉంటాయి. కాగా ఈ బైక్ లో మాత్రమే నూతనంగా యారో ఆర్కిటెక్చర్ టెక్నాలజీ రానుంది.
టెస్లా, శాంసంగ్ లాంటి..
యారో ఆర్కిటెక్చర్ ద్వారా 21,700 రకాల సిలిండ్రికల్ సెల్స్‌తో కూడిన బ్యాటరీ ప్యాక్‌ను ఎలక్ట్రిక్ బైక్ కోసం హార్లే డేవిడ్సన్ ఉపయోగిస్తోంది. ఇదే ఫార్మాట్‌ను టెస్లా, శాంసంగ్ వంటి కంపెనీలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఎస్2 డెల్ మార్ మిడిల్ వెయిట్ విభాగానికి చెందినదే అయినప్పటికీ... ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా లైటర్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను కూడా తయారుచేస్తారు.
హార్లే డేవిడ్సన్ లైవ్‌వైర్ ఇప్పటికే తైవాన్‌కి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ Kymcoతో టైఅప్ అయింది. భవిష్యత్తులో ఈ రెండు సంస్థలు కలిసి యారో ఆర్కిటెక్చర్ ద్వారా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నాయి.కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఈ ఏడాది జూన్-ఏప్రిల్ మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాగా ఈ బైక్ సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరసమైన ధరకు ఈ బైక్ అందుబాటులో వుంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment