
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ పార్లమెంటరీ అధికారులకు భారత పార్లమెంటరీ వ్యవస్థల పనితీరుపై అవగాహన కల్పించేందుకు బ్యూరో ఆఫ్ పార్లమెంటరీ స్టడీస్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 34వ ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో ఎంపీ కె.కవిత పాల్గొన్నారు. ఆగస్టు 2న ప్రారంభమైన ఇంటర్న్‌షిప్ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కవిత పాల్గొని ప్రసంగించారు. 20 దేశాల నుంచి 47 మంది పార్లమెంటరీ అధికారులు ఇంటర్న్‌షిప్‌కు హాజరయ్యారు
Comments
Please login to add a commentAdd a comment