రాజమహేంద్రవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశమిచ్చి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టీసీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు షీనా మేథ్యూ, ఎల్. రవి, సాయిసుస్మిత, శరణ్యలు మంగళవారం వీసీ ఆచార్య ఎం. జగన్నాథరావుతో సమావేశమయ్యారు. రెండు నెలలపాటు సాప్ట్‌వేర్ టూల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇప్పటికే తమ విద్యార్థులకు వికాస సహకారంతో కొన్ని ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. టీసీఎస్ సంస్థ కూడా ముందుకు రావడం హర్షణీయమన్నారు. జిల్లాలోని ప్రైవేట్ సంస్థలలో కూడా ఇంటెర్న్‌షిప్ అందించేందుకు తోడ్పడాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య టి. అశోక్, ఓఎస్‌డి ఆచార్య ఎస్. టేకి, డీన్ ఆచార్య పి. సురేష్‌వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. పెర్సిస్, వికాస్ పీడీ కె. లచ్చారావు, మేనేజర్ శ్రీకాంత్, శర్మ, తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా రెండు నెలల శిక్షణ
తూర్పు గోదావరి జిల్లాలో 3500 మంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా సెప్టెంబర్ చివరి వారం నుంచి రెండు నెలల శిక్షణ నిర్వహిస్తున్నామని కలెక్టర్ కే.మాధవీలత తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో టీసీఎస్ ప్రతినిధులు ఎన్.రవి, సుస్మిత, శరణ్య, వికాస్ పీడీ కే.లచ్చారావుతో కలిసి శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంస్థ తరఫున 15 నుంచి 20 మంది శిక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment