Adikavi Nannaya University
-
సుధామూర్తితో కలిసి డాక్టరేట్ అందుకున్న నైనా
భారత టేబుల్ టెన్నిస్ స్టార్, చదువుల తల్లిగా పేరొందిన నైనా జైస్వాల్ డాక్టరేట్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవం సందర్భంగా.. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నైనాకు పీహెచ్డీ డాక్టరేట్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తికి కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. కాగా అత్యంత పిన్న వయసులోనే పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న తొలి భారతీయ వ్యక్తిగా నైనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 22 ఏళ్ల వయసులోనే ఈ హైదరాబాదీ ఈ ఫీట్ నమోదు చేశారు. కుటుంబంతో నైనా జైస్వాల్ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ క్రమంలో పీహెచ్డీ పట్టా అందుకుని రికార్డు సాధించారు. కాగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా జైస్వాల్.. చదువులోనూ మేటి. ఎనిమిదేళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. తద్వారా ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో మోటివేషనల్ స్పీకర్‌గా రాణిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు. -
నన్నయ్య వర్సిటీ ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
-
3,282 వర్సిటీ పోస్టులకు నోటిఫికేషన్
రాజానగరం: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితో పాటు డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ తదితర ప్రతి పోస్టునూ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వర్సిటీల్లో ఇంత భారీ ఎత్తున ఖాళీల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. యూనివర్సిటీలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీకి సోమవారం వచ్చిన హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 18 వర్సిటీల్లో చదువుతున్న 12 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వారిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్హాక్ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని హేమచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో బోధిస్తున్నరన్నారు. వీరిలో సుమారు వెయ్యి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ (విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజుల నుంచి జీతాలు పొందేవారు) కింద పని చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చేపట్టే పోస్టుల భర్తీ ప్రక్రియలోకి వీరు రారని, వారి విధులకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. మిగిలిన వారు ఓపెన్ రిక్రూట్మెంట్లో ఇతరులతో పాటే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. వారి సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఇచ్చే 10 శాతం వెయిటేజీ మార్కులను ఏడాదికి ఒకటి చొప్పున లెక్కిస్తారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారన్నారు. వారి నుంచి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఒక పోస్టుకు నలుగురిని ఎంపిక చేస్తారని చెప్పారు. వర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీని కోసం ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రెహమాన్ అధ్యక్షతన కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భర్తీ ప్రక్రియను ప్రకటిస్తామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసమే ఇంటర్న్‌షిప్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో కొరవడుతోందనే ఉద్దేశంతోనే చదువుకునే సమయంలోనే ఇంటర్న్‌షిప్ చేయాలనే నిబంధన పెట్టామని ఆచార్య హేమచంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలుంటాయన్నారు. వారు ఇచ్చిన నివేదిక మేరకు ఎక్కడెక్కడ అవకాశాలున్నాయనే సమాచారాన్ని ఐఐసీ పోర్టల్‌లో ఉంచుతున్నామని వివరించారు. ఇవి కాకుండా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు వర్చువల్ విధానంలో ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నమని చెప్పారు. ఏడాదికి 3.50 లక్షల మంది ఇంటర్న్‌షిప్ చేయాల్సి వస్తుండగా సుమారు 5 లక్షల అవకాశాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. -
వేడుకగా హంస పురస్కారాల ప్రదానం
రాజానగరం: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో హంస పురస్కారాల ప్రదాన కార్యక్రమం మంగళవారం వేడుకగా జరిగింది. తెలుగు భాషాభివృద్ది కి విశిష్ట సేవలందిస్తున్న తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సన్మానించి, పురస్కారాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది మందికి హంస పురస్కారాలు ప్రదానం చేశారు.వీరిలో సాహిత్యంలో ఎస్.అబ్దుల్ అజీజ్ (రచయిత, కర్నూలు), మెడుగుల రవికృష్ణ (ఉపాధ్యాయుడు, గుంటూరు), డాక్టర్ జడా సుబ్బారావు (అసిస్టెంట్ ప్రొఫెసర్, నూజివీడు), వైహెచ్‌కే మోహనరావు (విలేకరి, పిడుగురాళ్ల), సామాజిక రచనలో ఎండపల్లి భారతి (రచయిత్రి, చిత్తూరు), కవిత్వంలో మాడభూషి సంపత్‌కుమార్ ఆచార్యులు (నెల్లూరు), అవధానంలో సూరం శ్రీనివాసులు (రిటైర్డ్ హెచ్ఎం, నెల్లూరు), సాంకేతిక రచనలు డాక్టర్ కేవీఎన్డీ వరప్రసాద్ (అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజమహేంద్రవరం) ఉన్నారు. వ్యాసరచన పోటీల్లో గండికోట హిమశ్రీ (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు), జస్మితరెడ్డి (మంగళగిరి)లకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి,‘నన్నయ’ వీసీ ఆచార్య పద్మరాజు, సాహితీవేత్త, సంఘ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త శలాక రఘునాధశర్మ, రిజిస్ట్రార్ ఆచార్య కె. సుధాకర్ ప్రసంగించారు. -
నన్నయ వర్సిటీ విద్యార్థులకు టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్
రాజమహేంద్రవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశమిచ్చి తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టీసీఎస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు షీనా మేథ్యూ, ఎల్. రవి, సాయిసుస్మిత, శరణ్యలు మంగళవారం వీసీ ఆచార్య ఎం. జగన్నాథరావుతో సమావేశమయ్యారు. రెండు నెలలపాటు సాప్ట్వేర్ టూల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇప్పటికే తమ విద్యార్థులకు వికాస సహకారంతో కొన్ని ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. టీసీఎస్ సంస్థ కూడా ముందుకు రావడం హర్షణీయమన్నారు. జిల్లాలోని ప్రైవేట్ సంస్థలలో కూడా ఇంటెర్న్షిప్ అందించేందుకు తోడ్పడాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య టి. అశోక్, ఓఎస్డి ఆచార్య ఎస్. టేకి, డీన్ ఆచార్య పి. సురేష్‌వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ వి. పెర్సిస్, వికాస్ పీడీ కె. లచ్చారావు, మేనేజర్ శ్రీకాంత్, శర్మ, తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా రెండు నెలల శిక్షణ తూర్పు గోదావరి జిల్లాలో 3500 మంది డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు టీసీఎస్ ద్వారా సెప్టెంబర్ చివరి వారం నుంచి రెండు నెలల శిక్షణ నిర్వహిస్తున్నామని కలెక్టర్ కే.మాధవీలత తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో టీసీఎస్ ప్రతినిధులు ఎన్.రవి, సుస్మిత, శరణ్య, వికాస్ పీడీ కే.లచ్చారావుతో కలిసి శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ సంస్థ తరఫున 15 నుంచి 20 మంది శిక్షణ నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
‘యూనివర్సిటీ ఘటనపై సీఎం సీరియస్‌గా ఉన్నారు’
సాక్షి, తూర్పుగోదావరి : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో విద్యార్ధినులకు వేధింపుల వ్యవహారంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం విచారణ నిర్వహించారు. యూనివర్సిటీలో వైస్ చాన్సలర్‌పై తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘నన్నయ్య యూనివర్సిటీలో అసాంఘిక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా ఉన్నారు. (చదవండి : కీచక అధ్యాపకుడిని నిలదీసిన మహిళలు..) గురుతరమైన వృత్తిలో ఉన్న కీచక ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రపై చర్యలు తీసుకోవడానికి వైస్ చాన్సలర్ ముందుకు రాలేదు. మహిళా సంఘాలు వచ్చిన తరువాతనే పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు’ అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్ర లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సోమవారం సస్పెండైన సంగతి తెలిసిందే. (చదవండి : నన్నయా... కనవయ్యా) -
ప్రొఫెసర్ రాఘవేంద్రపై సస్పెన్షన్ వేటు
సాక్షి, తూర్పు గోదావరి : లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్ర సస్పెండ్ అయ్యారు. రాఘవేంద్రపై లైంగిక ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ అతన్ని సస్సెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అంతకు ముందు యూనివర్సిటీ వద్దకు చేరుకున్న పలువురు మహిళలు రాఘవేంద్ర చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. వారిలో వైఎస్సార్సీపీ మహిళా నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర సాగించిన వేధింపులను వారు వీసీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రాఘవేంద్రను పలు అంశాలపై నిలదీశారు. అధ్యాపకుడు అయి ఉండి విద్యార్థినిలతో రాత్రి పూట చాటింగ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాఘవేంద్రపై చర్యలు తీసుకోవాలని.. ఆయన్ని కచ్చితంగా శిక్షించాలని కోరారు. విద్యార్థుల లేఖపై స్పందించి చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, పాఠాలు చెప్పాల్సిన ఈ మాస్టారు ప్రేమ పాఠాలు చెబుతూ.. లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. చాలా కాలంగా ప్రొఫెసర్ వేధింపులను భరిస్తూ వచ్చారు. వేధింపులు ఇటీవల మితిమీరిపోవడంతో నలుగురైదుగురు విద్యార్థినులు ధైర్యం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ నుంచి ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను లేఖలో పూసగుచ్చినట్టు వివరించారు. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఉన్నత విద్యాశాఖను ఆదేశించారు. ఆ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ టేకీ ఆధ్వర్యంలో అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. -
కీచక అధ్యాపకుడిని నిలదీసిన మహిళలు..
-
నన్నయ వర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని నన్నయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెమిస్టర్ విధానం, పేపర్ల వేల్యూయేషన్, ఫీజుల వసూళ్లతో అస్తవ్యస్థ విధానాలకు నిరసనగా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు సోమవారం యూనివర్సిటీని ముట్టడించారు. వర్సిటీ బయట బైఠాయించి వీసీ ముత్యాల నాయుడు బయటకు రావాలంటూ నిరసన తెలిపారు. అర్హత లేని వారితో పేపర్ వేల్యూయేషన్ చేయిండంతో తొమ్మిదివేల మంది ఫెయిల్ అయ్యారంటూ వారు ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. -
ఎమ్మెల్యే కోపం.. నిరుద్యోగులకు శాపం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం జరగాల్సిన ఉద్యోగ మేళా రద్దు అయిందన్న సమాచారం తెలియక వచ్చిన వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కారణంగా మేళా రద్దు చేయడమేంటని ఐదు జిల్లాల నుంచి వచ్చిన యువతీయువకులు మండిపడ్డారు. ఎంతో వ్యయప్రయాసలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను తీవ్ర నిరాశకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. 30 కంపెనీలకు సంబంధించి 2500 ఉద్యోగాల కల్పన కోసం కౌశల్ గోదావరి– వికాస్ సంస్థ ప్రతినిధుల సహకారంతో నన్నయ యూనివర్సిటీలో ఉద్యోగ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 10 వేల మంది నిరుద్యోగులకు సమాచారం పంపించారు. దీంతో వారంతా గురువారం సాయంత్రమే యూనివర్సిటీకి వచ్చేందుకు బయలుదేరారు. అయితే, ఈలోపే ఉద్యోగ మేళా ఆహ్వాన పత్రిక, బ్రోచర్, ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తన ఫొటో వేయకపోవడమేంటని, తనకు తెలియకుండా నిర్వహించడమేంటని నిర్వాహకులపై ఎమ్మెల్యే పెందుర్తి సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో ఉద్యోగ మేళాను రద్దు చేశారు. అయితే, ఈ విషయం తెలియని వారంతా శుక్రవారం నన్నయ యూనివర్సిటీకి వచ్చారు. మేళా రద్దు అయిందని కాకినాడలో జరుగుతుందని పెట్టిన బోర్డును చూసి షాక్ అయ్యారు. దీంతో కాకినాడ వెళ్లారు. అయితే, అక్కడ కేవలం ఆరు కంపెనీలకు చెందిన ఉద్యోగాలకే ఎంపిక చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆదికవి నన్నయ వర్సిటీపై నిర్లక్ష్యం
రాజానగరం : రాష్ట్ర బడ్జెట్లో ఉన్నత విద్యకు అతిస్వల్పంగానే కేటాయించారంటూ విద్యారంగానికి చెందిన పలువురు పెదవి విరుస్తున్నారు. రూ.1,35,688 కోట్ల బడ్జెట్లో ఉన్నత విద్యకు కేవలం రూ. 2,548 కోట్లు కేటాయిం చగా అందులో జిల్లాకు కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఆ మొత్తంకూడా తెలుగు యూనివర్సిటీకే కేటాయించి, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన ఆదికవి నన్నయ యూనివర్సిటీని విస్మరిం చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు వర్సిటీకి దక్కిందిలా.. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు యూనివర్సిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వారెందరో ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందజేశారు. దాంతో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా శ్రీకాకుళం, కూచిపూడి శాఖలను అభివృద్ధి చేస్తామన్న పాలకులు ఈ బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పుడు ఆ హామీకి కూడా పూర్తిగా నెరవేర్చకుండా తెలుగు వర్సిటీకి కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నారు. సుమారు 40 ఎకరాలు పైబడి భూములు వర్సిటీకి ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉన్న తెలుగు వర్సిటీని రాష్ర్టంలోని 13 జిల్లాలకు విస్తరించాల్సిన సమయంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కార్పొరేట్ భాషగా ఇంగ్లిష్
తణుకు టౌన్, న్యూస్‌లైన్ : ఇంగ్లిష్ కార్పొరేట్ భాషగా మారిపోయిందని, ఇందుకు తగ్గట్టుగా విద్యాబోధన ఉండాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ అకడమిక్ డీన్ కె.శ్రీరమేష్ అన్నారు. తణుకు ఎస్సీఐఎం డిగ్రీ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘స్కిల్ అప్డేట్ అండ్ రీట్రైనింగ్ ఆఫ్ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లిష్’ అంశంపై డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సెమినార్ శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా శ్రీరమేష్ మాట్లాడుతూ స్థానిక భాషల ప్రభావాన్ని తగ్గించుకోవడం ద్వారా ఇంగ్లిష్‌లో రాణించవచ్చన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తర,ప్రత్యుత్తరాలు జరపడంలో రాష్ట్ర అధ్యాపకులు వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఈ సెమినార్ ఏర్పాటుచేశామని చెప్పారు. ఇది విజయవంతమైతే జాతీయస్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఉన్నత విద్యాసంస్థలలో ఇంగ్లిష్ విద్యాబోదనపై కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ ఎంవీ భరతలక్ష్మి, ఇంగ్లిష్ వ్యాకరణం, నియమాలపై ఎ.రజనీకాంత్, ఇంగ్లిష్ మాట్లాడటంలో సమస్యలపై కాకినాడ పీఆర్ కళాశాల అధ్యాపకుడు ఏవీ నరసింహారావు ప్రసంగించారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కేవీ రమణమూర్తి, సెమినార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.శ్యాంబాబు, వర్క్‌షాపు డెరైక్టర్ ఏ రజనీకాంత్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ఎయిడెట్ డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. పలు అంశాలను శ్రీరమేష్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.