సాక్షి, తూర్పుగోదావరి : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో విద్యార్ధినులకు వేధింపుల వ్యవహారంపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం విచారణ నిర్వహించారు. యూనివర్సిటీలో వైస్ చాన్సలర్‌పై తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘నన్నయ్య యూనివర్సిటీలో అసాంఘిక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్‌గా ఉన్నారు.
(చదవండి : కీచక అధ్యాపకుడిని నిలదీసిన మహిళలు..)
గురుతరమైన వృత్తిలో ఉన్న కీచక ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రపై చర్యలు తీసుకోవడానికి వైస్ చాన్సలర్ ముందుకు రాలేదు. మహిళా సంఘాలు వచ్చిన తరువాతనే పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు’ అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్ర లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో సోమవారం సస్పెండైన సంగతి తెలిసిందే.
(చదవండి : నన్నయా... కనవయ్యా)
Comments
Please login to add a commentAdd a comment