సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని నన్నయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెమిస్టర్ విధానం, పేపర్ల వేల్యూయేషన్, ఫీజుల వసూళ్లతో అస్తవ్యస్థ విధానాలకు నిరసనగా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు సోమవారం యూనివర్సిటీని ముట్టడించారు.
వర్సిటీ బయట బైఠాయించి వీసీ ముత్యాల నాయుడు బయటకు రావాలంటూ నిరసన తెలిపారు. అర్హత లేని వారితో పేపర్ వేల్యూయేషన్ చేయిండంతో తొమ్మిదివేల మంది ఫెయిల్ అయ్యారంటూ వారు ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment