సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛభారత్ ఉద్యమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు మానవవనరులు, క్రీడలు, జలవనరుల మంత్రిత్వ శాఖలు రూపొందించిన స్వచ్ఛభారత్ ఇంటర్న్‌షిప్‌లో సమయాన్నివెచ్చించాలని కోరారు. ఆదివారం మన్ కీ బాత్‌లో మోదీ ఈ కార్యక్రమంప్రకటించారు. సమాజ బాగు కోసం కళాశాల విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ యువత, నెహ్రూ యువ కేంద్ర విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు.
కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిల్లో మెరుగైన సేవలందించిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో పురస్కారాలు అందిస్తామని చెప్పారు. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా ఇంటర్న్‌షిప్ ఆయనకు మనమిచ్చే నివాళి అన్నారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా విద్యార్ధులు ఒకటి లేదా అంతకుమించిన గ్రామాలను దత్తత తీసుకుని గ్రామీణ పారిశుద్ధ్యం సహా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మే 1 నుంచి జులై 31 వరకూ సాగే ఇంటర్న్‌షిప్ కనీసం 100 గంటల పాటు ఉంటుంది. మోదీ తన 30 నిమిషాలకు పైగా ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళా అథ్లెట్లు సత్తా చాటారని ప్రశంసిచారు. రంజాన్, బుద్ధపూర్ణిమ సందర్భంగా మహ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధలను ప్రధాని ప్రస్తుతించారు.
Comments
Please login to add a commentAdd a comment