swacha bharath
-
టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం
భోపాల్: వివాదాస్పద బీజేపీ ఎంపీ సాద్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించారు. అయితే ఈసారి విపక్షనేతలపై కాకుండా తన సొంత నియోజకవర్గ పార్టీ కార్యకర్తలపైనే. వర్షాకాలం కావడంతో.. సాద్వీ ప్రాతినిథ్యం వహిస్తున్న భోపాల్ పరిసర ప్రాంతాల్లో అపరిశ్రుభంగా మారాయి. అయితే ఆ ప్రాంత డ్రైనేజీ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. తమ ప్రాంతంలో ఓసారి స్వచ్ఛభారత్ చేపట్టండని ఆమెకి విజ్ఞప్తి చేశారు. దీంతో వారిపై ప్రజ్ఞా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమీ డ్రైనేజీలు శుభ్రం చేయడానికి ఎన్నికకాలేదని ఘాటుగా సమాధానమిచ్చారు. ‘మీ మురికివాడలను శుభ్రం చేయడానికి నేనేం పారిశుధ్య కార్మికురాలిని కాదు. డ్రైనేజీ, టాయిలెట్లను పరిశుభ్రం చేయడానికి కాదు నేను పార్లమెంట్‌కు ఎన్నికయింది. నేను స్థానిక ప్రజాప్రతినిధులను సమస్వయం చేసి పని చేయచేయిస్తాను’ అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులకు, కార్మికులకు, స్థానిక ఎమ్మెల్యేలకు తాను కేవలం ఆదేశాలు జారీ చేస్తానని, వారితో పనిచేయించుకోండని ప్రజ్ఞా ఉచిత సలహా ఇచ్చారు. ఎంపీ సమాధానంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అంటూ.. గంటల కొద్ది ప్రసంగాలు ఊదరకొడుతున్న విషయం తెలిసిందే. దీనిలో ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర్ర ప్రభుత్వాలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చినా అది ఏమాత్రం అమలుకావడంలేదు. ప్రజ్ఞా సమాధానంపై స్థానిక కాంగ్రెస్ నేత తారీక్ అన్వర్ తీవ్రంగా స్పందించారు. ఇది ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. దీనిపై ప్రధాని మోదీ వెంటనే కల్పించుకుని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా వివాదాస్పద నేతగా పేరొందిన సాద్వీ ప్రజ్ఞా.. ఎన్నికల సమయంలో ఎన్నోసార్లు నోరుజారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. -
ఇంటికి రూ.వంద బడికి చందా !
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు అందిస్తూ.. మరుగుదొడ్లు కట్టించి విద్యార్థులు వాటిని వినియోగించేలా చేయడం, మధ్యాహ్న భోజన సమయంలో చేతులు కడుక్కునేందుకు అందుబాటులో వాష్బేసిన్లు ఉంచడం, అక్కడ హ్యాండ్‌వాష్ లిక్విడ్ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే తొలుత నీటి సమస్యను అధిగమించాలని భావించి మిషన్ భగీరథ ద్వారా చాలా పాఠశాలలకు కనెక్షన్లు తీసుకున్నారు. ఇక పాఠశాలల్లో ఆచరించే అంశాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు నేర్పించడం ద్వారా స్వచ్ఛ భారత్ కల సాకారం కానుంది. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇంతకాలం విద్యార్థులు తాగడానికి నీళ్లు లేక.. అత్యవసరమైన వెళ్లడానికి బాత్రూంలు కానరాక.. కళావిహీనమైన గోడలతో కనిపించిన పాఠశాలను నూతన రూపు దాలుస్తున్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న నిధులకు తోడు స్థానికుల భాగస్వామ్యంతో నిధులు సేకరించిన చేపడుతున్న పనులతో ఇలా జరుగుతోంది.. ప్రతీ పాఠశాలలో సంక్రాంతి పండుగ నాటికి అన్ని వసతులు కల్పించేందుకు చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయం’ (ఎస్‌బీఎస్‌వీ) కార్యక్రమాన్ని జిల్లా అధి కారులు వినూత్నంగా చేపడుతున్నారు. ఈ మేరకు ‘ఇంటికి రూ.వంద... బడికి చందా’ నినాదాన్ని కలెక్టర్ రొనాల్డ్‌రోస్, డీఈఓ సోమిరెడ్డి సూచనలతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రమంత చేపడుతున్నా మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే పూర్తి స్థాయిలో విస్తృతంగా జరుగతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులే... సాధారణంగా పాఠశాలల్లో వసతుల కల్పన అనేది ప్రభుత్వం నుండి వచ్చే నిధులతోనే చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల వారిపై సామాజిక బాధ్యతగా పెరుగుతుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ భావించారు. ఈ మేరకు నిధుల సేకరణ కోసం గ్రామంలోని ప్రతి ఇళ్లు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, వ్యాపారవేత్తలు, అందుబాటులో ఉన్న కంపెనీలు, పూర్వ విద్యార్థుల సాయం తీసుకుంటున్నారు. ఇలా వారు ఇచ్చిన విరాళాలతో పాఠశాలలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. తద్వారా స్వగ్రామంలోని పాఠశాలను అందంగా తీర్చిదిద్దడంలో తమ భాగస్వామ్యం ఉందని వారు భావించి మరింత అభివృద్ధికి సహకరిస్తానని.. ఎప్పటికప్పుడు పనులను పరిశీలించే అవకాశముంటుందని కలెక్టర్ భావన. ఎస్‌బీఎస్‌వీ కార్యక్రమన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా కలెక్టర్ గతంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం కోసం పలు మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేశారు. ఫలితంగా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.87లక్షల వసూలైనట్లు సమాచారం. అత్యధికంగా జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట పాఠశాలకు రూ.70వేలు వసూలైనట్లు తెలుస్తోంది. నిధుల సేకరణకు మార్గాలు జిల్లాలో అన్ని యాజమానాల్లో కలిపి మొత్తం 1,356 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరికి పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం పెద్ద సవాల్‌గా ఉంటోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ‘స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంపై దృష్టి సారించారు. ఈ మేరకునిధుల కోసం కోసం ప్రతీ పాఠశాల ఆవరణలో హుండీ ఏర్పాటు చేయగా ఉపాధ్యాయులు, విద్యార్థులు తమకు తోచిన డబ్బు వేయొచ్చు. అలాగే, గ్రామంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటి చందా వసూలు చేయాలి. ఇది రూ.100 మొదలు ఎంతైనా కావొచ్చు. ముఖ్యంగా గ్రామంలోని వ్యాపార సముదాయాలు, రిటైర్డ్ ఉద్యోగులు, పూర్వవిద్యార్థులు, ఉద్యోగులు, యువజన సంఘాల, గ్రామ పెద్దలతో పాటు ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ వ్యాపారుల నుంచి విరాళాల సేకరణ జరుగుతోంది. సేకరించిన విరాళాలు పాఠశాల ఖాతాలో జమచేసి, పాఠశాల అవసరాల కోసం ఎస్ఎంసీ కమిటీ ఆధ్వర్యాన మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తారు. విరాళాలతో ప్రయోజనాలు విరాళాలు సేకరించడం వల్ల చాలా ప్రయోజనాలు కనిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో వసతులు కల్పించినా పూర్తి భద్రత ఉండేది కాదు. ముఖ్యంగా మరుగుదొడ్లు, వాష్బేసిన్లు, పైపులు, ట్యాంకులను స్థానికులే ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నా యి. అయితే, ప్రస్తుతం గ్రామస్తుల నుంచే విరాళాలు సేకరించడం ద్వారా సొంత ఆస్తిగా భావించి నిర్మాణాలను వారే కాపాడుకుంటారన్నది అధికా రుల భావన. ఇక వాటర్ఫిల్టర్లు, కంప్యూటర్లు విరా ళాలుగా అందినా నిర్వహణ లేక మూలకు పడుతు న్నాయి. వీటి నిర్వహణ కూడా పాఠశాలల నిధుల తో గ్రామస్తులు, ఎస్ఎంసీ కమిటీలు చూసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని చెకబుతున్నారు. విస్తృతంగా ఎస్బీ.. ఎస్వీ స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు విరాళాల సేకరణ విస్తృతంగా కొనసాగుతుంది. అనుకున్న సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుని పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు స్వచ్ఛత అలవాటు చేస్తాం. అంతేకాకుండా మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొస్తాం. పాఠశాల అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భాగస్వాములను చేసి నాణ్యత పాటించేందుకు కృషి చేస్తాం. కలెక్టర్ చొరవతో కార్యక్రమం అనుకున్న దాని కంటే బాగా కొనసాగుతోంది. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి -
స్వచ్ఛభారత్‌లో కలిసిరండి..
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛభారత్ ఉద్యమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు మానవవనరులు, క్రీడలు, జలవనరుల మంత్రిత్వ శాఖలు రూపొందించిన స్వచ్ఛభారత్ ఇంటర్న్‌షిప్‌లో సమయాన్నివెచ్చించాలని కోరారు. ఆదివారం మన్ కీ బాత్‌లో మోదీ ఈ కార్యక్రమంప్రకటించారు. సమాజ బాగు కోసం కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యువత, నెహ్రూ యువ కేంద్ర విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిల్లో మెరుగైన సేవలందించిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో పురస్కారాలు అందిస్తామని చెప్పారు. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాల సందర్భంగా ఇంటర్న్‌షిప్ ఆయనకు మనమిచ్చే నివాళి అన్నారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా విద్యార్ధులు ఒకటి లేదా అంతకుమించిన గ్రామాలను దత్తత తీసుకుని గ్రామీణ పారిశుద్ధ్యం సహా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మే 1 నుంచి జులై 31 వరకూ సాగే ఇంటర్న్‌షిప్ కనీసం 100 గంటల పాటు ఉంటుంది. మోదీ తన 30 నిమిషాలకు పైగా ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా అథ్లెట్లు సత్తా చాటారని ప్రశంసిచారు. రంజాన్, బుద్ధపూర్ణిమ సందర్భంగా మహ్మద్ ప్రవక్త, గౌతమ బుద్ధలను ప్రధాని ప్రస్తుతించారు. -
స్వచ్ఛభారత్‌లో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి ద్వితీయ స్థానం
ధర్మవరం అర్బన్ : స్వచ్ఛభారత్‌లో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి ద్వితీయ స్థానం లభించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రామలక్ష్మి తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బందితో కలిసి సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రామలక్ష్మి మాట్లాడుతూ జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో స్వచ్ఛభారత్ కింద ప్రభుత్వం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి మొదటి స్థానం ఇవ్వగా, ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి ద్వితీయ స్థానం వచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, డైరెక్టర్ దేవతా కృష్ణమూర్తి, కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, వైద్యులు లక్ష్మీరాంనాయక్, వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరి, వివేక్, యల్లోజీ, కంటి వైద్యుడు ఉరుకుందప్ప, కోఆర్డినేటర్ ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
మెసూరుకు మున్సిపల్ చైర్మన్లు
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ ర్యాకింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన మైసూర్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనానికి 13, 14 తేదీల్లో రాష్ట్రానికి చెందిన 27 పట్టణాల మున్సిపల్ చైర్మన్లు, అధికారులు ఆ నగరంలో పర్యటించనున్నారు. పర్యటనకు అనుమతిస్తూ గురువారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
అంతా తూచ్..!
– పేరుకు మాత్రమే బహిరంగ మల విసర్జన రహిత మునిసిపాలిటీలు – క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు – కనిపించని మరుగుదొడ్లు అనంతపురం న్యూసిటీ : జిల్లాలో ఈ నెల 2 నాటికి అన్ని మునిసిపాలిటీలను బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్ ఫ్రీ)ంగా తీర్చి దిద్దుతామని అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి లేదు. జిల్లాలోని అధిక మునిసిపాలిటీల్లో ఇప్పటికీ మహిళలు, చిన్నారులు బహిర్భూమికి ఆరుబయటకు వెళ్లే దుస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పేరిట వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించింది. వాస్తవంగా 2019 డిసెంబర్‌కల్లా బహిరంగ మల విసర్జన రహితం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి లక్ష్యాన్ని సాధిస్తామని ప్రకటించింది. జిల్లాలో తాడిపత్రి మునిసిపాలిటీ మాత్రమే 100 శాతం లక్ష్యానికి చేరుకుంది. ఇక అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, హిందూపురం, కదిరి, తదితర మునిసిపాలిటీల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు. నగరంలోనే అధ్వానం : జిల్లా కేంద్రంలోని రాజమ్మకాలనీ ప్రాంతంలో సామూహిక మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని ఏళ్లు గడుస్తోంది. నాలుగు నెలల కిందట ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్, మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. టాయిలెట్స్ ఏవీ..? నగరంలో టాయిలెట్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రధాన కూడళ్లలో టాయిలెట్స్ లేక మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘పే అండ్ యూజ్’ టాయిలెట్ల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అధికారుల టెండర్లను ఆహ్వానించారు. కొందరు ముందుకొచ్చిన వాటి నిర్మాణం మొదలవలేదు. అధికారిక లెక్కలిలా: మునిసిపల్ అధికారుల లెక్కల ప్రకారం రీజియన్‌లోని 11 మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో దాదాపుగా వందశాతం లక్ష్యాలను అధిగమించామని చెబుతున్నారు. అనంతపురం 98 శాతం, ధర్మవరం 99శాతం, గుత్తి, 97శాతం, గుంతకల్లు 96 శాతం, కదిరి 98, కళ్యాణదుర్గం 99 శాతం, పామిడి 98, పుట్టపర్తి 98శాతం, రాయదుర్గం 95 శాతం, తాడిపత్రి 100 శాతం, మడకశిర 94 శాతం, హిందూపురం 98 శాతం అయ్యిందని అధికారులు చెబుతున్నారు. –––––––––––––––––– వందశాతం అధిగమించాం.. బహిరంగ మల విసర్జన రహిత లక్ష్యాలను వందశాతం అధిగమించాం. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను అధిగమిస్తాం. బహిరంగ మల విసర్జన చేస్తే రూ 5 వేలు జరిమాన విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఎవరూ బహిరంగంగా మల,మూత్రం చేయరాదు. – విజయలక్ష్మి, ఆర్డీ -
రైల్వేస్టేషన్లో స్వచ్ఛభారత్
విజయవాడ (రైల్వేస్టేషన్) : రైల్వేస్టేషన్లో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని 1, 6, 7, 8, 9, 10 ప్లాట్‌ఫాంలను డీఆర్ఎం, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది శుభ్రం చేశారు. పార్శిల్ కార్యాలయం వద్ద డీఆర్ఎం మొక్కలు నాటారు. సీనియర్ డీసీఎం షిఫాలి, ఇన్చార్జి పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్, ఆర్పీఎఫ్ సీఐ చక్రవర్తి, ఎస్ఐలు సందీప్, రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈ–టాయిలెట్లు వచ్చేశాయ్..
* స్వచ్ఛ గుంటూరులో భాగంగా ఏర్పాటు * కాయిన్ వేస్తే డోర్ తెరుచుకుంటుంది... గుంటూరు (నెహ్రూనగర్): స్వచ్ఛ భారత్, స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా నగరాన్ని స్మార్ట్ సీటీగా తీర్చిదిద్దేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఈ (ఎలక్ట్రానిక్) టాయిటెట్లు ఏర్పాటు చేసింది. నగరంలో పలు చోట్ల నగరపాలక సంస్థ టాయిలెట్లు సౌకర్యవంతంగా లేకపోవడం, నిర్వహణ అంతంత మాత్రంగా ఉండటంతో నగర ప్రజలకు కొత్త రకం టాయిలెట్లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు. రూ.40 లక్షలతో ఏర్పాటు.. ఈ టాయిలెట్లను కే రళకు చెందిన ఈ– రామ్ సైంటిఫిక్ కంపెనీ తయారు చేసింది. ఒక్కొక్క దానికి రూ.8 లక్షల చొప్పున ఖర్చు చేసి 5 ప్రాంతాల్లో రూ. 40 లక్షలతోఈ టాయిలెట్లను కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ప్రధాన కూడళ్ళ వద్ద ఏర్పాటు.. జనం రద్దీగా ఉండే ప్రాంతాలైన పల్నాడు బస్టాండ్, కొల్లిశారదా మార్కెట్, గుజ్జనగుండ్ల, అరండల్‌పేట, నగరపాలక సంస్థ ప్రాంతంలో ఏర్పాటు చే శారు. ఇప్పటికే గుజ్జనగుండ్ల, అరండల్‌పేట, నగరపాలక సంస్థ తదితర ప్రాంతాల్లో ఈ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేశారు. కొల్లిశారదా మార్కెట్, పల్నాడు బస్టాండ్ల వద్ద నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా కొద్ది కాలంలోనే వీటిని వినియోగంలోకి తీసుకురానున్నట్లు నగరపాలక సంస్థ అ«ధికారులు చెబుతున్నారు. బాక్టీరియా క్రిములతో.. ఈ టాయిలెట్ల ద్వారా సెప్టిక్ ట్యాంక్‌లోకి వచ్చిన వ్యర్థాలను బయటికి తరలించే శ్రమ ఉండదు. సెప్టిక్ ట్యాంక్‌లో బ్యాక్టీరియా క్రిములు వేయడంతో వ్యర్థాలను ఈ క్రిములు తినివేస్తాయి. చివరికి నీరు మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ నీరు కూడా టాయిలెట్ల పక్కనే ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. నగరంలో ప్రజల నుంచి ఆదరణ వస్తే మరిన్ని టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలియజేశారు. పనిచేస్తుందిలా.. ఈ టాయిలెట్లను రూ.1, 2, 5 కాయిన్లు వేసి ఉపయోగించాల్సి ఉంటుంది. వినియోగించేవారు ముందుగా ఆకుపచ్చ రంగు వెలుగుతున్నప్పుడు ఈ కాయిన్లు వేస్తే ఆటోమేటిక్‌గా డోర్ తెరుచుకుంటుంది. ఒకరికి మాత్రమే వాడుకునే విధంగా దీనిని రూపొందించారు. సెన్సర్ పనిచేసేదిలా... ఈ టాయిలెట్లలో లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్‌గా ఫ్యాన్, లైటు వెలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నీళ్ళు కొట్టే పని లేకుండా సెన్సర్ల సహాయంతో వేస్ట్‌ని నీటితో శుభ్రం చేసుకుంటుంది. లోపల ఉన్న వ్యక్తికి అర్థమయ్యే విధంగా వాయిస్ డైరెక్షన్ కంప్యూటర్ చెబుతుంటుంది. 225 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకును టాయిలెట్ల వద్ద అమర్చారు. నిత్యం నీటి సరఫరా ఉండే విధంగా వీటిని రూపొందించారు. -
2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యం
భూదాన్‌పోచంపల్లి : తెలంగాణలో 2019 నాటికి బహిరంగ మలవిసర్జన లేకుండా సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్ ఎం.రామ్మోహన్రావు తెలిపారు. మంగళవారం మండంలోని దేశ్ముఖిలోని సాయి బృందావనంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వంద శాతం పూర్తి చేస్తామని అన్నారు. ఇలా మూడేళ్లలో దశల వారీగా రాష్ట్రంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆయన వెంట ఘంటా నారాయణస్వామిజీ, ఎంపీటీసీ దాసర్ల జంగయ్య ఉన్నారు. -
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు ముకరంపుర : కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వమే చేపట్టినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు ఆరోపించారు. కరీంనగర్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.80లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాలకు 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ, పెన్షన్రూపంలో నెలకు కనీసం రూ.5 లక్షలు గ్రామపంచాయతీలకు వస్తున్నాయన్నారు. జిల్లాలో మూతబడిన జాతీయ ఎరువుల కర్మాగారాన్ని తిరిగి పునరుద్దరించారని, ఎన్టీపీసీ పవర్కెపాసిటీని 2 వేల మెగావాట్లకు పెంచారని, పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్‌కు నిధులు కేటాయించారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్ల కరువు నిధులు ఎక్కడ ఖర్చు చేశారో స్పష్టం చేయూలని కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ ఆవిర్భవించనుందని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి మండల, ఆపై స్థాయి కార్యకర్తలు, నాయకులను ఆహ్వానిం చినట్లు చెప్పారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీనివాస్‌రెడ్డి, నా యకులు కన్నెబోయిన ఓదెలు, గుజ్జ సతీశ్, లింగంపల్లి శంకర్, హరికుమార్‌గౌడ్, సునీల్‌రావు, వేణు, మారుతి, ప్రశాంత్, కిషోర్ తదితరులున్నారు. -
మోదీ పాలన భేష్
బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్ టవర్‌సర్కిల్ : కేంద్రం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టి తనదైన ముద్ర వేశారని బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని శివనరేశ్ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రైతుల కోసం, పంటల బీమా పథకం ప్రవేశపెట్టడం, స్వచ్ఛభారత్ కింద వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. ఈనెల 14 నుంచి 24 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామస్వరాజ్ అభియాన్(దేశవ్యాప్త ప్రచార ఉద్యమం) నిర్వహించాలని నిర్ణయించారు. 17 నుంచి 20 వరకు రైతులతో సభ నిర్వహించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నం అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జ సతీశ్, ధర్మారం జెడ్పీటీసీ నారా బ్రహ్మయ్య, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ముదుగంటి రవీందర్‌రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ కర్ర సంజీవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆది కేశవులు, జిల్లా కార్యదర్శి పటేల్ రాంగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, మహిపాల్, పిల్లి శ్రీనివాస్, తాడ్వాయి శ్రీనివాస్‌రెడ్డి, నెల్ల చందు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఉగాది వేడుకలు
► ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు ► హాజరైన తీన్మార్ సత్తి, ప్రముఖ జానపద గాయకులు ► అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది పచ్చడి పంపిణీ నిర్మల్ టౌన్ : తీన్మార్ సత్తి పంచ్‌లు... చిన్నారుల సాం స్కృతిక కార్యక్రమాలతో ఉగాది ఉత్సవ స మితి ఆధ్వర్యంలో దుర్ముఖినామ సంవత్సరానికి ఆ హ్వానం పలికారు. పట్టణంలో ఉగాది వేడుకలు శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. స్థాని క పాత బస్టాండ్ వద్ద వేదిక ఏర్పాటు చేసి ప్ర త్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమా న్ని తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉగాది పచ్చడిని చింతకుంట వాడ నుం చి ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. తీన్మార్ ఫేం సత్తి ప్రేక్షకులను అలరించారు. తన మాటలతో చేష్టలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. సత్తి చేష్టలను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆస్వాదిం చారు. అనంతరం ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ చేశారు. ప్రముఖ జానపద కళాకారులు ఆలపించిన గేయాలు అలరించాయి. గోండ్ల సంప్రదాయ నృత్యాన్ని కళాకారులు చేసిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచిం ది. ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది పండుగను ప్రతి ఏటా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తారు. వేడుకలకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతుండడంతో ఉత్సవసమితి ఆధ్వర్యంలో ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ పా ఠశాలల విద్యార్థులే కాక, ఇతర ప్రాంతాల నుం చి కూడా విద్యార్థులు వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్సవసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన పలువురికి అవార్డులను అం దజేశారు. అనంతరం యోగానంద సరస్వతీ స్వామి ప్రవచనాలు, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీధర్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, ఉ గాది ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్, ఉత్సవసమితి అధ్యక్షుడు కొరిపెల్లి దేవేంధర్‌రెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, నాయకులు రామకృష్ణగౌడ్, గురుదీప్‌సింగ్ భాటియా, నవయుగమూర్తి, అన్నపూర్ణ, వేణుగోపాలకృష్ణ, పొడెల్లి చిన్నయ్య, గందె సుదీర్, రాంరమేశ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గండిరామన్న సాయిబాబా ఆలయంలో సాయి దీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో డీఎస్పీ మనోహర్‌రెడ్డి పంచాంగం ఆవిష్కరించారు. అనంతరం ఆచార్య కళ్యాణ్ పంచాంగ శ్రవణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇందులో బీజేపీ స్వచ్ఛ భారత్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్, సబ్ రిజిస్ట్రార్ జ్యోతి, సాయి దీక్షా సేవా సమితి సభ్యులు దేవిదాస్, శ్రీయ, గోవర్ధన్, పడిగెల లింగయ్య, దేవన్న, రేణుకాదాస్, హరీష్, శివ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛభారత్‌లో జిల్లాకు ప్రశంస
ఢిల్లీ సదస్సులో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ కరీంనగర్ సిటీ : స్వచ్ఛభారత్‌లో రాష్ట్రంలోనే ఉత్తమ ప్రతిభ కనపరిచిన కరీంనగర్ జిల్లాకు ఢిల్లీ సదస్సులో ప్రశంస లభించింది. స్వచ్ఛభారత్ మిషన్ రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఐఐపీఈ, తాగునీటి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 32 జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. జిల్లానుంచి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్ హాజరయ్యారు. ఇతర జిల్లాలతో పోల్చితే సత్వర ఫలితాలు సాధించిన కరీంనగర్ జిల్లాకు సదస్సులో ప్రశంసలు లభించాయి. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మంచి ఫలితాలు సాధించాయని, త్వరలో మిగిలిన పది నియోజకవర్గాల్లోనూ పూర్తిస్థాయి మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతామని చైర్పర్సన్ తుల ఉమ వివరించారు. స్వచ్ఛభారత్ అమలులో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ కృషిని తెలియచేశారు. -
‘స్వచ్ఛ’ పురస్కారం
► ‘స్వచ్ఛ విద్యాలయ’ జాతీయ పురస్కారానికి కలెక్టర్ ఎంపిక ► ఈ నెల 21న ఢిల్లీలో విజ్ఞానభవన్‌లో ప్రదానం ► ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకోనున్న కలెక్టర్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమం అమలులో కలెక్టర్ ఎం.జగన్మోహన్ క ృషి ఫలించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వాటి నిర్వహణ ద్వారా విద్యార్థుల హాజరు శా తం పెంచడంలో విశేష క ృషి చేసిన ఆయనకు ప్రధానమంత్రి ప్రజాసేవ పురస్కారం దక్కింది. జాతీయ పౌరసేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా కలెక్టర్ ఈ అత్యుత్తమ సేవా పురస్కారాన్ని అందుకోనున్నారు. వంద శాతం అమలుకు చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించి, విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడంతోపాటు హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛభారత్ స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాల్లో ఈ కార్యక్రమం బాధ్యతలను కలెక ్టర్లకు అప్పగించింది. ఈ మేరకు కలెక్టర్ గతేడాది ఏప్రిల్‌లో కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 3,989 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 2,978 ప్రాథమిక పాఠశాలలు కాగా, 408 ప్రాథమికోన్నత పాఠశాలు, 573 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో అక్షరాస్యత 61 శాతం ఉండగా, పురుషులు అక్షరాస్యత 70 శాతం, మహిళల అక్షరాస్యత 51 శాతం ఉంది. ప్రతీ పాఠశాలలో ఒక మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో మొత్తం 4,312 మరుగుదొడ్లను నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నాణ్యంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు నచ్చే విధంగా నిర్మించేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలు నిర్వహించి వీటి నిర్మాణ ప్రగతిని కలెక్టర్ పర్యవేక్షించారు. విద్యార్థులకు మరుగుదొడ్డి ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రతిజ్ఞ సమయంలో పిల్లలతో స్వచ్ఛతా, పరిశుభ్రత మీద ప్రతిజ్ఞ చేయించడం, తరగతి గదిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం అక్షరాస్యత, మరుగుదొడ్డి ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అనేక గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించేలా చర్యలు చేపట్టారు. ఎంపిక చేశారిలా.. దేశంలో వివిధ జిల్లాలో ఈ కార్యక్రమం అమలవుతోంది. దీనిపై ఎప్పటికప్పుడు కలెక్టర్ కేంద్రానికి నివేదికలు పంపారు. ఈ నివేదికలను పరిశీలించి, నిజ నిర్ధారణ చేసేందుకు కేంద్ర ఉన్నతాధికారుల బృం దా లు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేశాయి. ఈ బృందం కూడా క్షేత్రస్థాయి నివేదికలను కేంద్రానికి పంపింది. ఇదే సమయంలో సుప్రీం కోర్టు నియమించిన స్వచ్ఛ కమిటీ సైతం జిల్లాలో పర్యటించి సం త ృప్తి వ్యక్తం చేసింది. ఈ బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా దేశంలో మొత్తం 688 జిల్లాల్లో 75 జిల్లాల ను ప్రథమ స్థాయిలో ఎంపిక చేయడం జరిగింది. ఢి ల్లీలో జరిగిన కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ జగన్మోహన్తోపాటు, సంబంధిత అధికారులు మరుగుదొడ్ల నిర్మాణంలో సాధించిన ప్రగతి, వాటి ఉపయోగం, పెరిగిన హాజరు శాతం మీద, విద్యార్థుల చదువులో కనిపించిన మార్పులను గుణాత్మకంగా వివరించారు. మూడు స్థాయిల నివేదిక ఆధారంగా.. రెండో స్థాయిలో ఎంపిక చేసిన 75 జిల్లాల్లో కేంద్ర బృందాలు గ్రామాల్లో సందర్శించి నివేదికను సమర్పించింది. ఈ బృందం మూడు రోజులపాటు జిల్లా లో ఆదివాసీ, గోండు, కొలామ్ గ్రామాలను సందర్శించింది. వీటి నిర్మాణం ప్రగతి, నాణ్యత, విద్యా కమిటీల భాగస్వామ్యం, వాటి వినియోగం, పాఠశాల లో హాజరు శాతం, పరిశుభ్రత వంటి అంశాల్లో నిర్మాణాత్మకమైన మార్పులున్నాయని ప్రభుత్వానికి నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా మూడో స్థాయిలో దేశంలో పది జిల్లాలు ఎంపిక చేశారు. మరోసారి రా ష్ట్రస్థాయి అధికారుల ృందం జిల్లాలో పర్యటించి ఒక డాక్యుమెంటరీని తయారు చేసి కేంద్రానికి నివేదిం చింది. మూడు స్థాయిల్లో ఇచ్చిన నివేదికలను ఆధారంగా అత్యుత్తమ సేవా పురస్కారానికి జిల్లా కలెక్టర్‌ను ఎంపిక చేసింది. -
'స్వచ్ఛ భారత్'లో నల్లగొండ ఎస్పీ
నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా ఎస్పీ దుగ్గల్ శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని మదీనా మసీదులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు పలువురు పోలీసులు, నగర ప్రజలు పాల్గొన్నారు. -
'స్వచ్ఛ భారత్‌కు ఎంపీల్యాడ్ వద్దు'
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి(ఎంపీల్యాడ్) నిధుల వాడాలన్న యోచనను బుధవారం లోక్‌సభలో విపక్షాలు వ్యతిరేకించాయి. స్వచ్ఛ భారత్‌కు ఈ నిధులను వాడే అంశంపై సభ చర్చించాలని పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సూచించగా జ్యోతిరాదిత్య, కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్)తోపాటు పలు విపక్షాల సభ్యులు నిరసన తెలిపారు. ఇలాంటి యత్నానికి అంగీకరించబోమన్నారు. -
'స్వచ్ఛ భారత్‌లో అందరూ భాగస్వాములు కావాలి'
తూర్పుగోదావరి (అంబాజీపేట): తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని ఇరుసుమందలో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రామన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు ఏజీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులకోసం రూ. 70కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. -
టీవీ ‘షో’లతో స్వచ్ఛ భారత్ సాధిస్తారా?
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూటిప్రశ్న విజయవాడ సెంట్రల్ : ఫొటోలకు ఫోజులిచ్చి, టీవీలో షో చేస్తే స్వచ్ఛభారత్ అమలు సాధ్యమవుతుందా అని పీసీసీ అధ్యక్షుడు ఎం.రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. మాజీ ప్రధాని స్వర్గీయ చాచా నెహ్రూ 125వ జయంతి వేడుకల్ని ఆంధ్రరత్నభవన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతున్న ప్రధాని మోదీ... క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. మురికివాడల్లో దుర్గంధాన్ని తొలగించకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చకుండా స్వచ్ఛ భారత్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. టీవీలు, పేపర్లకు ఫోజులివ్వడంతోనే స్వచ్ఛభారత్‌ను సాధించేశామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంబరపడుతున్నాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు గాంధీజీ, నెహ్రూ ఎన్నో త్యాగా లు చేశారని చెప్పారు. ఏళ్లతరబడి జైళ్లలో గడిపిన వారు ఏనాడు బెయిల్ కోసం ప్రయత్నించలేదన్నారు. కాం గ్రెస్ పార్టీ వల్లే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలి పారు. దళిత, గిరిజనుల సంక్షేమం కార్యక్రమాలకు నెహ్రూ, ఇందిరాగాంధీ పెద్దపీట వేశారని చెప్పారు. చిన్నారుల చేతిలోనే భవిష్యత్... చిన్నారుల చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని రఘువీరారెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ సంస్థ నిర్వహణలో సాగే పత్రికలో గాంధీని చంపిన గాడ్సే నెహ్రూను చంపాల్సి ఉందని పిచ్చి రాతలు రాశారన్నారు. ప్రతి భారతీయుడు దీన్ని ఖండించాలన్నారు. అనంతరం మడోనా బదిరుల పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులకు రఘువీరా రెడ్డి నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, సిటీకాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రాజేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దేవినేని అవినాష్, సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు పి.రాజీవ్త్రన్ తదితరులు పాల్గొన్నారు.