‘స్వచ్ఛ’ పురస్కారం
► ‘స్వచ్ఛ విద్యాలయ’ జాతీయ పురస్కారానికి కలెక్టర్ ఎంపిక
► ఈ నెల 21న ఢిల్లీలో విజ్ఞానభవన్‌లో ప్రదానం
► ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకోనున్న కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమం అమలులో కలెక్టర్ ఎం.జగన్మోహన్ క ృషి ఫలించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వాటి నిర్వహణ ద్వారా విద్యార్థుల హాజరు శా తం పెంచడంలో విశేష క ృషి చేసిన ఆయనకు ప్రధానమంత్రి ప్రజాసేవ పురస్కారం దక్కింది. జాతీయ పౌరసేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా కలెక్టర్ ఈ అత్యుత్తమ సేవా పురస్కారాన్ని అందుకోనున్నారు.
వంద శాతం అమలుకు చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించి, విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడంతోపాటు హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛభారత్ స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాల్లో ఈ కార్యక్రమం బాధ్యతలను కలెక ్టర్లకు అప్పగించింది. ఈ మేరకు కలెక్టర్ గతేడాది ఏప్రిల్‌లో కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 3,989 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 2,978 ప్రాథమిక పాఠశాలలు కాగా, 408 ప్రాథమికోన్నత పాఠశాలు, 573 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
జిల్లాలో అక్షరాస్యత 61 శాతం ఉండగా, పురుషులు అక్షరాస్యత 70 శాతం, మహిళల అక్షరాస్యత 51 శాతం ఉంది. ప్రతీ పాఠశాలలో ఒక మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో మొత్తం 4,312 మరుగుదొడ్లను నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నాణ్యంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు నచ్చే విధంగా నిర్మించేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలు నిర్వహించి వీటి నిర్మాణ ప్రగతిని కలెక్టర్ పర్యవేక్షించారు. విద్యార్థులకు మరుగుదొడ్డి ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రతిజ్ఞ సమయంలో పిల్లలతో స్వచ్ఛతా, పరిశుభ్రత మీద ప్రతిజ్ఞ చేయించడం, తరగతి గదిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం అక్షరాస్యత, మరుగుదొడ్డి ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అనేక గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించేలా చర్యలు చేపట్టారు.
ఎంపిక చేశారిలా..
దేశంలో వివిధ జిల్లాలో ఈ కార్యక్రమం అమలవుతోంది. దీనిపై ఎప్పటికప్పుడు కలెక్టర్ కేంద్రానికి నివేదికలు పంపారు. ఈ నివేదికలను పరిశీలించి, నిజ నిర్ధారణ చేసేందుకు కేంద్ర ఉన్నతాధికారుల బృం దా లు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేశాయి. ఈ బృందం కూడా క్షేత్రస్థాయి నివేదికలను కేంద్రానికి పంపింది. ఇదే సమయంలో సుప్రీం కోర్టు నియమించిన స్వచ్ఛ కమిటీ సైతం జిల్లాలో పర్యటించి సం త ృప్తి వ్యక్తం చేసింది. ఈ బృందం ఇచ్చిన నివేదికల ఆధారంగా దేశంలో మొత్తం 688 జిల్లాల్లో 75 జిల్లాల ను ప్రథమ స్థాయిలో ఎంపిక చేయడం జరిగింది. ఢి ల్లీలో జరిగిన కార్యక్రమంలో మన జిల్లా కలెక్టర్ జగన్మోహన్‌తోపాటు, సంబంధిత అధికారులు మరుగుదొడ్ల నిర్మాణంలో సాధించిన ప్రగతి, వాటి ఉపయోగం, పెరిగిన హాజరు శాతం మీద, విద్యార్థుల చదువులో కనిపించిన మార్పులను గుణాత్మకంగా వివరించారు.
మూడు స్థాయిల నివేదిక ఆధారంగా..
రెండో స్థాయిలో ఎంపిక చేసిన 75 జిల్లాల్లో కేంద్ర బృందాలు గ్రామాల్లో సందర్శించి నివేదికను సమర్పించింది. ఈ బృందం మూడు రోజులపాటు జిల్లా లో ఆదివాసీ, గోండు, కొలామ్ గ్రామాలను సందర్శించింది. వీటి నిర్మాణం ప్రగతి, నాణ్యత, విద్యా కమిటీల భాగస్వామ్యం, వాటి వినియోగం, పాఠశాల లో హాజరు శాతం, పరిశుభ్రత వంటి అంశాల్లో నిర్మాణాత్మకమైన మార్పులున్నాయని ప్రభుత్వానికి నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా మూడో స్థాయిలో దేశంలో పది జిల్లాలు ఎంపిక చేశారు. మరోసారి రా ష్ట్రస్థాయి అధికారుల ృందం జిల్లాలో పర్యటించి ఒక డాక్యుమెంటరీని తయారు చేసి కేంద్రానికి నివేదిం చింది. మూడు స్థాయిల్లో ఇచ్చిన నివేదికలను ఆధారంగా అత్యుత్తమ సేవా పురస్కారానికి జిల్లా కలెక్టర్‌ను ఎంపిక చేసింది.