బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్
టవర్‌సర్కిల్ : కేంద్రం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టి తనదైన ముద్ర వేశారని బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని శివనరేశ్ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రైతుల కోసం, పంటల బీమా పథకం ప్రవేశపెట్టడం, స్వచ్ఛభారత్ కింద వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు. ఈనెల 14 నుంచి 24 వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామస్వరాజ్ అభియాన్(దేశవ్యాప్త ప్రచార ఉద్యమం) నిర్వహించాలని నిర్ణయించారు.
17 నుంచి 20 వరకు రైతులతో సభ నిర్వహించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నం అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జ సతీశ్, ధర్మారం జెడ్పీటీసీ నారా బ్రహ్మయ్య, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు ముదుగంటి రవీందర్‌రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ కర్ర సంజీవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆది కేశవులు, జిల్లా కార్యదర్శి పటేల్ రాంగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, మహిపాల్, పిల్లి శ్రీనివాస్, తాడ్వాయి శ్రీనివాస్‌రెడ్డి, నెల్ల చందు తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలన భేష్
Published Thu, Apr 14 2016 3:19 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
Advertisement
Advertisement