
తిరుచిరాపల్లి: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు ముగ్ధుడైన ఓ తమిళ రైతు మోదీకి గుడి కట్టాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి 63 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరకుడి గ్రామం లో పి.శంకర్ అనే రైతు మోదీ గుడిని గత వారమే ప్రారంభించాడు. అక్కడ మోదీ ప్రతిమకు ప్రతిరోజూ హారతి ఇస్తున్నాడు. తను ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందానని, ఆయనంటే తనకెంతో అభిమానమని శంకర్ పేర్కొన్నాడు. గుడి నిర్మాణానికి లక్షా ఇరవై వేల రూపాయల ఖర్చు అయింది.
Comments
Please login to add a commentAdd a comment