build temple
-
250 కిలోల అభిమానం
అభిమానులు తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టడం కొత్త కాదు. అయితే ఆ గుడి బయట ఎక్కడో ఉంటుంది. తమిళనాడులోని మదురైకి చెందిన కార్తీక్... రజనీకాంత్‌కు వీరాభిమాని. తన ఇంటిలోని ఒక పోర్షన్‌ను రజనీ గుడిగా మలిచాడు. ఇందులో 250 కిలోల బరువు ఉన్న రజనీ విగ్రహం ఉంది. రోజూ ధూపదీప నైవేద్యాలు ఉంటాయి. ‘రజనీకాంత్‌ను దేవుడి స్థాయిలో ఆరాధిస్తున్నాను’ అంటున్నాడు కార్తీక్. -
మోదీకి గుడి కట్టిన రైతు
తిరుచిరాపల్లి: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు ముగ్ధుడైన ఓ తమిళ రైతు మోదీకి గుడి కట్టాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లికి 63 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరకుడి గ్రామం లో పి.శంకర్ అనే రైతు మోదీ గుడిని గత వారమే ప్రారంభించాడు. అక్కడ మోదీ ప్రతిమకు ప్రతిరోజూ హారతి ఇస్తున్నాడు. తను ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందానని, ఆయనంటే తనకెంతో అభిమానమని శంకర్ పేర్కొన్నాడు. గుడి నిర్మాణానికి లక్షా ఇరవై వేల రూపాయల ఖర్చు అయింది. -
వాళ్ళకి నచ్చితే గుడికడతారు....
-
గీదేందీ శంకరన్నా... యాది మర్సినవా
రాష్ట్ర విభజన జరిగిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడింది. ఆ ఘనత తమ పార్టీ అధ్యక్షురాలు సోనియ తల్లిదే నంటూ ఢంకా బకాయించి మరీ చెప్పాడు అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరన్న. సోనియా త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అందుకు సోనియా తల్లింటూ కీర్తించాడు. ఆమె విగ్రహాం ఏర్పాటు చేస్తానని శంకరన్న మీడియా ముందు మీరీ ఓ రేంజ్లో చెప్పాడు. అందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశాడు. ఓ వేళ ప్రభుత్వం కేటాయించకుంటే... తానే తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సోనియా తల్లి విగ్రహాం ఏర్పాటు చేస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. సోనియా తల్లి విగ్రహాన్ని సొంత ఖర్చులతో విజయవాడ సమీపంలో తయారు చేయించాడు కూడా. ఆ విగ్రహాం తయారవుతున్న దశలో శంకరన్న కుటుంబ సభ్యులతో కలసి సోనియా విగ్రహం తయారీని మరీ పరిశీలించి వచ్చారు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో ఈ వీర విథేయుడైన శంకరన్నకు మాత్రం చోటు దక్కలేదు. దాంతో శంకరన్నకు కోపం కట్టలు తెంచుకుని... తన్నుకొచ్చింది. అధిష్టాన దేవత సోనియాను తెలంగాణలోని నాయకులు ఎవరు కీర్తించని విధంగా బోళా శంకరుడిలా కీర్తించిన తనకు న్యాయం జరగలేదని శంకరన్న లోలోన ఫీలైపోయాడు. అంతే అభ్యర్థుల జాబితాలో తనకు చోటు లేనిపప్పుడు... తన వ్యవసాయ క్షేత్రంలో సోనియా తల్లికి చోటు లేదని భావించినట్లు ఉన్నాడు. అంతే సోనియా తల్లి గుడి సోదిలో లేకుండా పోయింది. కనీసం మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఈ గుడి గుర్తుకు వస్తుందేమో చూడాలి. -
లతా మంగేష్కర్‌కు ఆలయం
తమ ఆరాధ్య హీరోలు, హీరోయిన్లకు అభిమానులు ఆలయాలను నిర్మించిన సంఘటనల గురించి విన్నాం. భారతదేశంలో అందునా దక్షిణాదిన సినీతారలను వెర్రిగా అభిమానిస్తారు. విశేషమేంటంటే.. సుప్రసిద్ధ గాయని కోసం ఓ అభిమాని గుడి నిర్మించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన వర్ధమాని గాయని వర్షా జాలని.. భారత గానకోకిల లతా మంగేష్కర్‌కు వీరాభిమాని. లతాను దేవతలా ఆరాధించే వర్ష తన ఇంట్లోనే ఆమె కోసం ఓ ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుని లత ఫొటో ఉంచింది. వర్ష ఆ ఫొటో ముందు నిల్చునే పాటలు పాడటం సాధన చేసేదట. 'రెండు దశాబ్దాలుగా లతాజీ ప్రార్థన మందిరంలో సాధన చేస్తున్నాను. ఆమె ఫొటో చూడగానే ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలుగుతాయి' అని వర్ష అంటోంది. ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఆశిస్తున్న వర్ష ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. మూడ్రోజుల క్రితం తన ఆరాధ్య గాయని లతాను ఆమె ఇంట్లో కలసే అవకాశం వచ్చినందుకు సంబరపడిపోతోంది.