తమ ఆరాధ్య హీరోలు, హీరోయిన్లకు అభిమానులు ఆలయాలను నిర్మించిన సంఘటనల గురించి విన్నాం. భారతదేశంలో అందునా దక్షిణాదిన సినీతారలను వెర్రిగా అభిమానిస్తారు. విశేషమేంటంటే.. సుప్రసిద్ధ గాయని కోసం ఓ అభిమాని గుడి నిర్మించింది. మధ్యప్రదేశ్కు చెందిన వర్ధమాని గాయని వర్షా జాలని.. భారత గానకోకిల లతా మంగేష్కర్కు వీరాభిమాని.
లతాను దేవతలా ఆరాధించే వర్ష తన ఇంట్లోనే ఆమె కోసం ఓ ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుని లత ఫొటో ఉంచింది. వర్ష ఆ ఫొటో ముందు నిల్చునే పాటలు పాడటం సాధన చేసేదట. 'రెండు దశాబ్దాలుగా లతాజీ ప్రార్థన మందిరంలో సాధన చేస్తున్నాను. ఆమె ఫొటో చూడగానే ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలుగుతాయి' అని వర్ష అంటోంది. ప్లేబ్యాక్ సింగర్ కావాలని ఆశిస్తున్న వర్ష ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. మూడ్రోజుల క్రితం తన ఆరాధ్య గాయని లతాను ఆమె ఇంట్లో కలసే అవకాశం వచ్చినందుకు సంబరపడిపోతోంది.
లతా మంగేష్కర్కు ఆలయం
Published Sun, Sep 29 2013 1:27 PM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement
Advertisement