నాగోలు: మహిళల అభ్యున్నతి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, మహిళాసాధికరతకు ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అన్నారు. బుధవారం రాత్రి నాగోలు డివిజన్ బండ్లగూడ అనంద్‌నగర్‌లో బీజేపీ రంగారెడ్డి అర్బన్ మహిళా మోర్చా పాలసీ, రీసెర్చ్ ఇంచార్జి కాలంశెట్టి లయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (చదువు, ఉపాధి, వ్యవస్థాపకత, సాధికారత) 4 ఈ సెంటర్‌ను వనతి శ్రీనివాసన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలను చదువు, ఉపాధి రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. వ్యవస్థాపకత, సాధికరత కోసం 4 ఈ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో రాణించేలా మహిళలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సుకన్య సమృద్ధి పథకం, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. మహిళల అభ్యదయ కోసం తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా 4 సెంటర్ నాగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, నాగోలు కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి నళిని, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ విభాగం అధ్యక్షుడు సామ రంగారెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి, నేతలు శ్యామల, గజం రాజ్యలక్షి్మ, బద్దం బాలకృష్ణగౌడ్, డప్పురాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment