Mahila Morcha
-
బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన
హైదరాబాద్: ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. కంగనాపై చేసిన వ్యాఖ్యలకు దానం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద బీజేపీ మహిళా మోర్చా మెరుపు ఆందోళన చేపట్టింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు దిగింది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ దిష్టి బొమ్మ దహనం చేశారు బీజేపీ మహిళా మోర్చా మహిళా నేతలు. దానం చేసిన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా నేతలు మండిపడ్డారు.దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ.. ‘ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదు. బాధ్యతగల ఎమ్మెల్యేగా చౌకబారు వ్యాఖ్యలు తగదు. దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.సినిమా ఇండస్ట్రీలో బోగం వేషాలు వేసే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదంటూ దానం వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. -
జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష విధించాలని అధ్యక్షురాలు శిల్పా రెడ్డి డిమాండ్ చేశారు.కాగా, షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల అంశంపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి తాజాగా స్పందించారు. ఈ క్రమంలో శిల్పారెడ్డి మాట్లాడుతూ.. యువతిని లైంగికంగా హింసించిన జానీకి కఠిన శిక్ష పడాలి. మతం మారాలని ఒత్తిడి చేయడం లవ్ జిహాద్‌కు సంబంధించిన కేసు. వేధింపుల కేసులో జానీని ఇంకా అరెస్ట్ చేయకపోవడం దారుణం. జానీని వెంటనే అరెస్ట్ చేయాలి’ అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తుపై వేగం పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అలాగే, ఆమెకు వైద్య పరీక్షలు కూడా ముగిశాయి. ఈ కేసులో మరిన్ని వివరాల సేకరించేందుకు పోలీసులు.. నేడు బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు.ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు! -
Womens Reservation Bill 2023: సుస్థిర ప్రభుత్వం వల్లే మహిళా బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్రంలో పూర్తి మెజార్టీతో కూడిన బలమైన, సుస్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బిల్లుకు రికార్డు స్థాయిలో మద్దతు లభించిందని, చిరకాలం నాటి కల సాకారమైందని అన్నారు. పూర్తి మెజార్టీతో కూడిన స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే గొప్ప నిర్ణయాలు తీసుకోవచ్చని ఈ పరిణామం నిరూపిస్తోందని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ మహిళా ఎంపీలు, నేతలు శుక్రవారం ఢిల్లీలో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కలి్పంచడం అనేది సాధారణ చట్టం కాదని చెప్పారు. ఇది నవ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక అంకితభావ తీర్మానమని స్పష్టం చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్న ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పుడు తాము తీసుకొచి్చన బిల్లుకు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వ హయాంలో మహిళా శక్తి పెరిగిందని, అందుకే బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించిందని వివరించారు. గౌరవాన్ని పెంచితే తప్పేమిటి? మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం కంటే ముందే మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని స్థాయిల్లో మహిళల స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా పని చేశామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలు అడ్డుపడకుండా చర్యలు చేపట్టామన్నారు. గతంలో ఈ బిల్లు విషయంలో అప్పటి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆక్షేపించారు. మహిళలను కించపర్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. మహిళా బిల్లుకు ‘నారీశక్తి వందన్’ అనే పేరుపెట్టడం పట్ల విపక్ష ఎంపీలు చేస్తున్న ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. మహిళామణుల గౌరవాన్ని పెంచితే తప్పేమిటని ప్రశ్నించారు. బిల్లును పార్లమెంట్లో ఆమోదించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల బీజేపీ ఆకాంక్ష నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. మహిళల్లో నూతన విశ్వాసం కొన్ని నిర్ణయాలకు దేశ భవిష్యత్తు మార్చే శక్తి ఉంటుందని, ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వాటిలో ఒకటని ప్రధానమంత్రి అన్నారు. ఈ చట్టం మహిళల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందని, దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ నెల 20, 21న కొత్త చరిత్ర నమోదైందని, దీని గురించి భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయని పేర్కొన్నారు. ‘మోదీ గ్యారంటీలు’ అమలవుతాయని చెప్పడానికి మహిళా బిల్లే ఒక నిదర్శనమని చెప్పారు. మహిళల సారథ్యంలో అభివృద్ధి అనే నూతన శకంలోకి అడుగుపెట్టబోతున్నామని ప్రకటించారు. భారత్‌ను చంద్రుడిపైకి చేర్చడంలో మహిళల పాత్ర కీలకమని ప్రశంసించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. -
మహిళాభ్యుదయం కోసమే ‘4 ఈ సెంటర్’
నాగోలు: మహిళల అభ్యున్నతి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, మహిళాసాధికరతకు ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అన్నారు. బుధవారం రాత్రి నాగోలు డివిజన్ బండ్లగూడ అనంద్‌నగర్‌లో బీజేపీ రంగారెడ్డి అర్బన్ మహిళా మోర్చా పాలసీ, రీసెర్చ్ ఇంచార్జి కాలంశెట్టి లయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (చదువు, ఉపాధి, వ్యవస్థాపకత, సాధికారత) 4 ఈ సెంటర్‌ను వనతి శ్రీనివాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలను చదువు, ఉపాధి రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. వ్యవస్థాపకత, సాధికరత కోసం 4 ఈ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో రాణించేలా మహిళలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సుకన్య సమృద్ధి పథకం, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. మహిళల అభ్యదయ కోసం తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా 4 సెంటర్ నాగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, నాగోలు కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి నళిని, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ విభాగం అధ్యక్షుడు సామ రంగారెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి, నేతలు శ్యామల, గజం రాజ్యలక్షి్మ, బద్దం బాలకృష్ణగౌడ్, డప్పురాజు పాల్గొన్నారు. -
ఇక్కడ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా నాలుగు గోడల మధ్య కూర్చుని మేనిఫెస్టోను రూపొందించడం లేదన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను స్వయంగా పరిశీలించి వారు ఏం కోరుకుంటున్నారో చేసిన అధ్యయనంతోనే పక్కాగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బందులతోపాటు వారి ఆర్ధిక, ఆరోగ్య పరిస్థితుల గురించి మహిళామోర్చా నాయకులు, కార్యకర్తలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. గురువారం పార్టీ మహిళా విధానాలు, పరిశోధన విభాగం ఇంచార్జ్ కరుణా గోపాల్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, మహిళా మోర్చా నేతలతో సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్రం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ఇక్కడ అందుతున్నాయా? లేదా? అసలు ఈ పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లండి’’అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని సస్పెండ్చేయాలి గవర్నర్ డా.తమిళి సై సౌందరరాజన్‌ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి డిమాండ్ చేశారు. గురువారం కరుణా గోపాల్, ఇతర నేతలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు మహిళలను అగౌరపరుస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి ఉదంతమే ఉదాహరణ అన్నారు. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కే భద్రత కరువైందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు. -
ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి
హైదరాబాద్: ప్రియాంకారెడ్డిపై జరిగిన అఘాయిత్యం పట్ల రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీలు బాధ్యతారహితంగా హేళనగా మాట్లాడటం సమంజసం కాదని, దీనికిగానూ తక్షణమే వారిద్దరూ క్షమాపణ చెప్పాలని మాజీ మం త్రి, బీజేపీ నాయకురాలు డి.కె.అరుణ డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ధర్నాచౌక్ వద్ద మౌనదీక్ష నిర్వహించింది. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని, మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేసింది. మౌనదీక్షకు ముందు జరిగిన సభలో డి.కె.అరుణ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు, హత్యలు, యాసిడ్ దాడు లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
బీజేపీ మహిళా మోర్చా నియామకాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గాన్ని నియమించినట్లు మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులుగా కె.సునీతారెడ్డి (రంగారెడ్డి), యమున పాథక్ (మల్కాజిగిరి), డి.పవిత్ర (ఉప్పల్), రవళి కుచన (వరంగల్–అర్బన్), కల్పనా ఠాకూర్ (నిజామాబాద్), పద్మ (హైదరాబాద్), ఝాన్సీ (కుత్బుల్లాపూర్), అంథే శైలజ (ఎల్బీనగర్).. ప్రధాన కార్యదర్శులుగా సీహెచ్ గోదావరి అంజిరెడ్డి (సంగారెడ్డి), కేతినేని సరళ (హైదరాబాద్), ఎం.నాగ పరిమళ (మేడ్చల్) నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా శిల్పారెడ్డి (మేడ్చల్), ఎల్.తిరుమల (సిద్దిపేట), జి.సుధారెడ్డి (దుబ్బాక), వనం పుష్పలత (నల్లగొండ), ఎ.లలిత (వికారాబాద్), సుమతీరెడ్డి (రంగారెడ్డి), విజయలక్ష్మి (ముషీరాబాద్)లను నియమించారు. వీరితో పాటు కార్యాలయ కార్యదర్శిగా భారతి రజనీ కుటూర్, కె.వసుధ (సోషల్ మీడియా), వనిత (అంగన్వాడి), అధికార ప్రతినిధులుగా సుజాత, జయలక్ష్మి, ఎస్.భాగ్యలక్ష్మి, వినోదారెడ్డి, ఝాన్సీరాణి నియమితులయ్యారు. మరో 16 మందిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు.