బీజేపీ మహిళా మోర్చా నియామకాలు | BJP mahila morcha recruitments | Sakshi
Sakshi News home page

బీజేపీ మహిళా మోర్చా నియామకాలు

Published Fri, Apr 7 2017 3:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP mahila morcha recruitments

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గాన్ని నియమించినట్లు మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులుగా కె.సునీతారెడ్డి (రంగారెడ్డి), యమున పాథక్‌ (మల్కాజిగిరి), డి.పవిత్ర (ఉప్పల్‌), రవళి కుచన (వరంగల్‌–అర్బన్‌), కల్పనా ఠాకూర్‌ (నిజామాబాద్‌), పద్మ (హైదరాబాద్‌), ఝాన్సీ (కుత్బుల్లాపూర్‌), అంథే శైలజ (ఎల్బీనగర్‌).. ప్రధాన కార్యదర్శులుగా సీహెచ్‌ గోదావరి అంజిరెడ్డి (సంగారెడ్డి), కేతినేని సరళ (హైదరాబాద్‌), ఎం.నాగ పరిమళ (మేడ్చల్‌) నియమితులయ్యారు.

రాష్ట్ర కార్యదర్శులుగా శిల్పారెడ్డి (మేడ్చల్‌), ఎల్‌.తిరుమల (సిద్దిపేట), జి.సుధారెడ్డి (దుబ్బాక), వనం పుష్పలత (నల్లగొండ), ఎ.లలిత (వికారాబాద్‌), సుమతీరెడ్డి (రంగారెడ్డి), విజయలక్ష్మి (ముషీరాబాద్‌)లను నియమించారు. వీరితో పాటు కార్యాలయ కార్యదర్శిగా భారతి రజనీ కుటూర్,  కె.వసుధ (సోషల్‌ మీడియా), వనిత (అంగన్‌వాడి), అధికార ప్రతినిధులుగా సుజాత, జయలక్ష్మి, ఎస్‌.భాగ్యలక్ష్మి, వినోదారెడ్డి, ఝాన్సీరాణి నియమితులయ్యారు. మరో 16 మందిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement