ఘనంగా ఉగాది వేడుకలు | Ugadi celebrations on a grand celebratation | Sakshi
Sakshi News home page

ఘనంగా ఉగాది వేడుకలు

Published Sat, Apr 9 2016 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

ఘనంగా ఉగాది వేడుకలు

ఘనంగా ఉగాది వేడుకలు

ఉగాది ఉత్సవ సమితి  ఆధ్వర్యంలో వేడుకలు
హాజరైన తీన్మార్ సత్తి, ప్రముఖ జానపద గాయకులు
అలరించిన  సాంస్కృతిక కార్యక్రమాలు ఉగాది పచ్చడి పంపిణీ

 
 
నిర్మల్ టౌన్ :
తీన్మార్ సత్తి పంచ్‌లు... చిన్నారుల సాం స్కృతిక కార్యక్రమాలతో ఉగాది ఉత్సవ స మితి ఆధ్వర్యంలో దుర్ముఖినామ సంవత్సరానికి ఆ హ్వానం పలికారు. పట్టణంలో ఉగాది వేడుకలు శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. స్థాని క పాత బస్టాండ్ వద్ద వేదిక ఏర్పాటు చేసి ప్ర త్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమా న్ని తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉగాది పచ్చడిని చింతకుంట వాడ నుం చి ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు మంగళహారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. తీన్మార్ ఫేం సత్తి ప్రేక్షకులను అలరించారు. తన మాటలతో చేష్టలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. సత్తి చేష్టలను చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆస్వాదిం చారు.

అనంతరం ఉత్సవసమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ చేశారు. ప్రముఖ జానపద కళాకారులు ఆలపించిన గేయాలు అలరించాయి. గోండ్‌ల సంప్రదాయ నృత్యాన్ని కళాకారులు చేసిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచిం ది. ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది పండుగను ప్రతి ఏటా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తారు. వేడుకలకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతుండడంతో ఉత్సవసమితి ఆధ్వర్యంలో ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ పా ఠశాలల విద్యార్థులే కాక, ఇతర ప్రాంతాల నుం చి కూడా విద్యార్థులు వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్సవసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన పలువురికి అవార్డులను అం దజేశారు.

అనంతరం యోగానంద సరస్వతీ స్వామి ప్రవచనాలు, ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీధర్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, ఉ గాది ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు పొన్నం నారాయణ గౌడ్, ఉత్సవసమితి అధ్యక్షుడు కొరిపెల్లి దేవేంధర్‌రెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, నాయకులు రామకృష్ణగౌడ్, గురుదీప్‌సింగ్ భాటియా, నవయుగమూర్తి, అన్నపూర్ణ, వేణుగోపాలకృష్ణ, పొడెల్లి చిన్నయ్య, గందె సుదీర్, రాంరమేశ్ తదితరులు పాల్గొన్నారు.


 పట్టణంలోని గండిరామన్న సాయిబాబా ఆలయంలో సాయి దీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో డీఎస్పీ మనోహర్‌రెడ్డి పంచాంగం ఆవిష్కరించారు. అనంతరం ఆచార్య కళ్యాణ్ పంచాంగ శ్రవణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇందులో బీజేపీ స్వచ్ఛ భారత్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు రావుల రాంనాథ్, సబ్ రిజిస్ట్రార్ జ్యోతి, సాయి దీక్షా సేవా సమితి సభ్యులు దేవిదాస్, శ్రీయ, గోవర్ధన్, పడిగెల లింగయ్య, దేవన్న, రేణుకాదాస్, హరీష్, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement