రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛభారత్
విజయవాడ (రైల్వేస్టేషన్) :
రైల్వేస్టేషన్‌లో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్‌లోని 1, 6, 7, 8, 9, 10 ప్లాట్‌ఫాంలను డీఆర్‌ఎం, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది శుభ్రం చేశారు. పార్శిల్ కార్యాలయం వద్ద డీఆర్‌ఎం మొక్కలు నాటారు. సీనియర్ డీసీఎం షిఫాలి, ఇన్‌చార్జి పీఆర్వో జేవీఆర్‌కే రాజశేఖర్, ఆర్పీఎఫ్ సీఐ చక్రవర్తి, ఎస్‌ఐలు సందీప్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.