ముంబై: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ త్వరలో ప్రారంభించే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో చేరేందుకు అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడరల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం (ఎఫ్‌ఐపీ) పేరిట నిర్వహించే ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లుగా ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఎంఏజీఈ)తో కలిసి ఈ కోర్సును అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.
కోర్సు పూర్తయిన తర్వాత మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్టిఫికెట్ అందుకోవచ్చని ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. అంతేకాదు ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఫెడరల్ బ్యాంక్‌లోనే అవకాశాలు దక్కవచ్చు కూడా. ఈ ప్రోగ్రాంలో చేరే అభ్యర్థులు ఏటా రూ. 5.70 లక్షల దాకా ఆర్జించే అవకాశాలు ఉంటాయని పేర్కొంది.
దరఖాస్తు చేసుకోవాలంటే..
► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు
► పదో తరగతి, ఇంటర్(ఫ్లస్ టూ), గ్రాడ్యుయేషన్.. ఏదైనా సరే 60 శాతం మార్కులకు పైబడి ఉండాలి
► 2021 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థి వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు.
► దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 23
►నవంబర్ 11న ఆన్‌లైన్‌లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి కింద లింక్‌ను క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment