కలెక్టర్ త్వరలో రిలీవ్! | Riliv collector soon! | Sakshi
Sakshi News home page

కలెక్టర్ త్వరలో రిలీవ్!

Published Sat, May 24 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

Riliv collector soon!

  •      ఉన్నత చదువుల కోసం విదేశాలకు..
  •      25న సీఎస్‌ను కలవనున్న ఆరోఖ్యరాజ్
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ త్వరలో రిలీవ్ కానున్నారు. ఉన్నత చదువుల కోసం సెలవుపై విదేశాలకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలవనున్నారు. సీఎస్ అనుమతి ఇస్తే కొద్ది రోజుల్లోనే విధుల నుంచి రిలీవై ఇన్‌చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

    విదేశాల్లో ఉన్నత చదువుల కోసం సెలవు కావాలని ఎన్నికలకు మూడు నెలల ముందే కేంద్రానికి ఆయన లేఖ రాశారు. అప్పుడే అనుమతి లభించినా సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున రిలీవ్ కాలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో సెలవుపై వెళ్లాలని కలెక్టర్ భావిస్తున్నారు. రిలీవ్‌కి అనుమతి కోసం ఈ నెల 25న కలెక్టర్ సీఎస్‌ను కలవనున్నట్టు తెలిసింది.

    ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు బదిలీలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిలీవ్‌కు అనుమతి లభిస్తుందా? లేదా అనే విషయం ఈ నెల 25 తర్వాత తేలనుంది. ఒకవేళ అనుమతి రానిపక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఆయన విధుల నుంచి రిలీవ్‌కానున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement