riliv
-
చేంజ్..
సాక్షి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ బాధ్యతల నుంచి జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి రిలీవ్ అయ్యారు. జేసీ హోదాలో జిల్లా స్థాయిలో చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున మున్సిపాలిటీ విధుల నుంచి ఆయనను రిలీవ్ చేయాలని పురపాలకశాఖ డైరెక్టరేట్ (సీడీఎంఏ)కు కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ లేఖ రాశారు. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌గా హౌసింగ్ పీడీకి బాధ్యతలు అప్పగించాలని సైతం లేఖలో పేర్కొన్నారు. స్పం దించిన పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి కూడా కలెక్టర్ ప్రతిపాదనను ఆమోదిస్తూ ఫ్యాక్స్ ద్వారా ఉత్తర్వులు పంపారు. ఈ మేరకు నారాయణరెడ్డి సోమవా రం మున్సిపాలిటీ అదనపు కమిషనర్ అరుణకుమారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. మరోవైపు పూర్తిస్థాయి ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్‌గా హౌ సింగ్ పీడీ రాజ్‌కుమార్ నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. 7న లేఖ... 13న రిలీవ్ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఈ నెల ఏడో తేదీన జేసీ నారాయణరెడ్డిని నల్లగొండ మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని సీడీఎంఏకు లేఖ రాశారు. జాయింట్ కలెక్టర్ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలతోపాటు అనేక శాఖలు, సంస్థల కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, టాస్క్‌ఫోర్స్ తనిఖీల వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించారు. గ్రేడ్–1 మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ పరిధిలో ప్రతి రోజూ నిర్వహించాల్సిన కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో ఉండడంతో జేసీపై అదనపు పనిభారం పడుతోందని వివరించారు. మున్సిపాలిటీలో జనన, మరణ «ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి ఎల్ఆర్ఎస్, భవన నిర్మాణ, నల్లా అనుమతులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలను రోజువారీగా పర్యవేక్షించాల్సి ఉంటుందని, ఈ పనులు వాయిదా వేసేవి కావని లేఖలో వివరించారు. ప్రభుత్వ పథకాలను నిర్ణీత కాలంలో అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ చెబుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ వ్యవహారాలు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల అమలు, పలు ప్రాజెక్టుల భూసేకరణ వ్యవహారాలను జేసీ చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే జేసీ నారాయణరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థకు ఇన్చార్జి అధికారిగా, డాక్టర్ కేఎల్ రావ్ సాగర్, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు భూసేకరణ స్పెషల్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కూడా లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో తాను జేసీని నల్లగొండ మున్సిపల్ బాధ్యతల నుంచి ఉపసంహరించుకుంటున్నానని ఈనెల 7న సీడీఎంఏకు లేఖ రాశారు. వెంటనే స్పందించిన పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్. టీకే.శ్రీదేవి కూడా కలెక్టర్ ప్రతిపాదనను ఆమోదిస్తూ ఫ్యాక్స్ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో జేసీ నారాయణరెడ్డి సోమవారం అధికారికంగా బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. పీడీ రాజ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించేంత వరకు మున్సిపాలిటీ అదనపు కమిషనర్ సీహెచ్.అరుణకుమారిని ఇన్చార్జిగా నియమించారు. చాలా తక్కువ సందర్భాల్లోనే.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలపై జిల్లా కలెక్టర్‌కు రాజ్యాంగపరమైన అధికారాలున్నా.. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న లేదా ఇన్చార్జి బాధ్యతలో ఉన్న అధికారులను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయడం, దాన్ని ఆమోదించాలని సదరు శాఖ డైరెక్టర్‌కు కలెక్టర్ లేఖ రాయడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. నల్లగొండ మున్సిపాలిటీ విషయంలో కూడా అదే జరిగింది. అయితే.. జేసీ నారాయణరెడ్డి జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే చురుకైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, ఉద్యోగుల సమన్వయం వంటి బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. కలెక్టర్ ఉప్పల్ సైతం జెట్స్పీడ్తో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. కలెక్టర్, జేసీలు సమన్వయంతో నిర్వహించాల్సిన ప్రణాళికలు చాలా ఉన్నందున ఉప్పల్ ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలంటున్నాయి. -
మా రాష్ట్రానికి మేము వెళ్తాం..
ఏపీ జెన్కో ఎండీ గది ఎదుట బైఠాయించిన టీఎస్ విద్యుత్ ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: తమను సొంత రాష్ట్రానికి రిలీవ్ చేయాలని కోరుతూ ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళనలను తీవ్రతరం చేశారు. గురువారం మధ్యాహ్నం విద్యుత్ సౌధలోని ఏపీ జెన్కో మేనేజింగ్ డెరైక్టర్ కావేటి విజయానంద్ గది ఎదుట సుమారు 200 మంది తెలంగాణ ఉద్యోగులు ధర్నాకు దిగి గంటపాటు బైఠాయించారు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరిని నిరసిస్తూ నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌనప్రదర్శన చేశారు. రాష్ట్ర విభజనకు ఏడాదిలోపే ఉద్యోగుల విభజన పూర్తికావాల్సి ఉండగా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అందుకు అడ్డుపడుతున్నాయని తెలంగాణ ఉద్యోగులు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్వ్ టు ఆర్డర్ కింద ఏడాదిపాటు ఏపీలో పనిచేశామని ఇక పరాయిరాష్ట్రంలో ఎక్కువ కాలం కొనసాగలేమని ఉద్యోగులు తెలిపారు. మరో రెండు రోజులపాటు ఏపీజెన్కో సీఎండీ గది ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామన్నారు. అప్పటికీ తమను రిలీవ్ చేయకపోతే వచ్చే నెల 2న విద్యుత్ సౌధను ముట్టడించి ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. అయితే, తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లపై స్పందించేందుకు ఏపీ జెన్కో ఎండీ కె.విజయానంద్ నిరాకరించారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎండీ స్పందించకూడదని ఆయన కార్యాలయ వర్గాలు విలేకరులకు తెలిపాయి. తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ, మధుసూదన్‌రెడ్డి, జానయ్య తదితరులు ఈ ధర్నాలో పాల్గొని తెలంగాణ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. -
ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలని రేపు ధర్నా
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లోని తెలంగాణ ఉద్యోగుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లోని ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 29న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైదరాబాద్ సైఫాబాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అయినా స్పందన లేకుంటే 31 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగుల విభజన పూర్తయ్యింది. రెగ్యులర్ ఉద్యోగుల్లో తెలంగాణకు 79, ఏపీకి 99 మందిని కేటాయించారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది విభజన పూర్తికాలేదు. ఏపీకి కేటాయించిన రెగ్యులర్ ఉద్యోగులు ఇంకా రిలీవ్ కాలేదు. దీంతో టీ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ, ఇంక్రిమెంట్లు అందకుండా పోతున్నాయని టీ ఉద్యోగులు వాపో తున్నారు. కావాలనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కాలయాపన చేస్తున్నారని అంటున్నారు. -
కేంద్రమే పరిష్కరించాలి
విద్యుత్ ధర్నాలో ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: స్థానికత పేరుతో తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంలు బాధ్యతతో వీలైనంత త్వరగా రిలీవ్ అయిన 1,253 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలన్నారు.హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఏపీ విభజన సమయంలో రాష్ట్రాలనే భేదం లేకుండా అందరికి న్యాయం చేస్తానని చెప్పిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు విద్యుత్ ఉద్యోగుల విషయంలో ఆ మాట నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపకుండా పరస్పరం నిందారోపణలు చేసుకోడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కేవీపీ, జేడీ శీలం, తోట నర్సింహం, రవీంద్రబాబు, కొత్తపల్లి గీత, రామ్మోహన్నాయుడు, మాగంటి బాబు, మాల్యాద్రి పాల్గొన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మోదీ పీఎస్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే ప్రధానితో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని, ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు తెలిపారు. -
బదిలీ అయినా...రిలీవ్ కాని దేవాదాయ శాఖ ఇన్చార్జ్ ఏసీ
నల్లగొండ, న్యూస్‌లైన్: జిల్లా దేవాదాయ శాఖలో ఓ అధికారి బదిలీ ఉత్తర్వులు చేతికందినా, విధుల్లోంచి రిలీవ్ కాలేదు. పైగా జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన ఓ అధికారితో సన్నిహితంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుంటున్నాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.... జిల్లా దేవాదాయ శాఖ ఏసీ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ బాధ్యతలను చెర్వుగట్టు దేవస్థానం ఈఓ విజయరామరాజుకు అప్పగించారు. ఈ రెండింటితో పాటు హైదరాబాద్‌లో బాల్గంపేట, సికింద్రాబాద్ వినాయక దేవస్థానాలకు ఇన్చార్జ్ వ్యవహరిస్తున్నాడు. మొత్తంగా నాలుగుచోట్ల విధులు నిర్వర్తిస్తున్నాడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బదిలీల్లో భాగంగా ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తూ దేవాదాయ కమిషనర్ నుంచి ఈ నెల 1వ తేదీన ఉత్తర్వు నెం.బి4/9869/2014-4 జారీ అయింది. వెంటనే విధుల నుంచి తప్పుకుని కమిషనర్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని , జిల్లా ఇన్చార్జ్ ఏసీ బాధ్యతలు కార్యాలయ సూపరింటెండెంట్‌కు, చెరుగుట్టు ఈఓ బాధ్యతలు మనోహర్ రెడ్డికి అప్పగించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ దేవస్థానాల బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. అయితే మన జిల్లాలోని రెండు పోస్టుల నుంచి రిలీవ్ కాలేదు. ప్రస్తుతం చెర్వుగట్టు దేవస్థానం వద్ద భవన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పాత ఫైళ్లను క్లియర్ చేసే పనిలో ఉండేందుకు ఇంకా రిలీవ్ కాలేదనే గుసగుసలు దేవస్థానం ఉద్యోగుల నుంచి వినవస్తున్నాయి. అంతేకాకుండా విజయరామరాజు శుక్రవారం హుజూర్నగర్ మండలం బూరగడ్డ వెళ్లి దేవాదాయ భూముల సెటిల్మెంట్ వ్యవహారంలో కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు రిటైర్డ్ ఏసీ మధానాచారి కూడా వెళ్లారు. విధుల నుంచి తప్పుకోమని కార్యాలయ అధికారులు కోరినప్పటికి రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ సూపరింటెండెండ్ రామచంద్రరావు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ బదిలీ ఉత్తర్వులు ఈనెల 1 తేదీన వచ్చాయని, హైదరాబాద్‌లో కూడా రిలీవ్ అయారని చెప్పారు. కార్యాలయ పనుల నిమిత్తం శుక్రవారం బూరుగడ్డ వె ళ్లిన మాట వాస్తవేమనని ఆయన ధృవీకరించారు. రిలీవ్ కావాలని తాము పలుమార్లు కోరినట్లు రామచంద్రరావు తెలిపారు. -
కలెక్టర్ త్వరలో రిలీవ్!
ఉన్నత చదువుల కోసం విదేశాలకు.. 25న సీఎస్‌ను కలవనున్న ఆరోఖ్యరాజ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ త్వరలో రిలీవ్ కానున్నారు. ఉన్నత చదువుల కోసం సెలవుపై విదేశాలకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలవనున్నారు. సీఎస్ అనుమతి ఇస్తే కొద్ది రోజుల్లోనే విధుల నుంచి రిలీవై ఇన్చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం సెలవు కావాలని ఎన్నికలకు మూడు నెలల ముందే కేంద్రానికి ఆయన లేఖ రాశారు. అప్పుడే అనుమతి లభించినా సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున రిలీవ్ కాలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో సెలవుపై వెళ్లాలని కలెక్టర్ భావిస్తున్నారు. రిలీవ్కి అనుమతి కోసం ఈ నెల 25న కలెక్టర్ సీఎస్‌ను కలవనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు బదిలీలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిలీవ్‌కు అనుమతి లభిస్తుందా? లేదా అనే విషయం ఈ నెల 25 తర్వాత తేలనుంది. ఒకవేళ అనుమతి రానిపక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఆయన విధుల నుంచి రిలీవ్‌కానున్నారు. -
కలెక్టర్ త్వరలో రిలీవ్!
ఉన్నత చదువుల కోసం విదేశాలకు.. 25న సీఎస్‌ను కలవనున్న ఆరోఖ్యరాజ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ త్వరలో రిలీవ్ కానున్నారు. ఉన్నత చదువుల కోసం సెలవుపై విదేశాలకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలవనున్నారు. సీఎస్ అనుమతి ఇస్తే కొద్ది రోజుల్లోనే విధుల నుంచి రిలీవై ఇన్చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం సెలవు కావాలని ఎన్నికలకు మూడు నెలల ముందే కేంద్రానికి ఆయన లేఖ రాశారు. అప్పుడే అనుమతి లభించినా సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున రిలీవ్ కాలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో సెలవుపై వెళ్లాలని కలెక్టర్ భావిస్తున్నారు. రిలీవ్కి అనుమతి కోసం ఈ నెల 25న కలెక్టర్ సీఎస్‌ను కలవనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు బదిలీలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిలీవ్‌కు అనుమతి లభిస్తుందా? లేదా అనే విషయం ఈ నెల 25 తర్వాత తేలనుంది. ఒకవేళ అనుమతి రానిపక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఆయన విధుల నుంచి రిలీవ్‌కానున్నారు.