పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లోని తెలంగాణ ఉద్యోగుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లోని ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 29న మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైదరాబాద్ సైఫాబాద్‌లోని కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. అయినా స్పందన లేకుంటే 31 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగుల విభజన పూర్తయ్యింది.
రెగ్యులర్ ఉద్యోగుల్లో తెలంగాణకు 79, ఏపీకి 99 మందిని కేటాయించారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బంది విభజన పూర్తికాలేదు. ఏపీకి కేటాయించిన రెగ్యులర్ ఉద్యోగులు ఇంకా రిలీవ్ కాలేదు. దీంతో టీ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ, ఇంక్రిమెంట్లు అందకుండా పోతున్నాయని టీ ఉద్యోగులు వాపో తున్నారు. కావాలనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కాలయాపన చేస్తున్నారని అంటున్నారు.
ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలని రేపు ధర్నా
Published Fri, Aug 28 2015 1:39 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement