తనిఖీల విషయంలో చూసి చూడనట్టుగా..
బ్యాంకాక్ నుండి థాయ్ ఎయిర్ ఎయిర్ ఏషియా విమానంలో వచ్చిన ఓ వ్యక్తి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను ఎయిర్‌పోర్టులోని శౌచాలయంలో దాచినట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారమందింది. దీంతో విమానాశ్రయంలోని శౌచాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులకు శౌచాలయంలో పిల్లల డైపర్‌డిస్పెన్సరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ యంత్రాన్ని స్కానర్ల సహాయంతో స్కానింగ్ చేయగా అందులో కార్బన్, ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన ప్యాకెట్లను గుర్తించారు. డిస్పెన్సరీని తెరచి చూడగా అందులో బంగారు బిస్కెట్లు, ఇతర బంగారు, వజ్రాభరణాల లభించాయి.
యంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆచూకీ కోసం ఎయిర్‌పోర్టులోని సీసీకెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన అధికారులు డిస్పెన్సరీ యంత్రంతో శౌచాలయంలోకి వెళుతున్న వ్యక్తిని గమనించిన అధికారులు ఎయిర్‌పోర్టును సిబ్బందిని అప్రమత్తం చేసారు. ఎయిర్‌పోర్టు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వ్యక్తిని తమిళనాడుకు చెందిన మహమద్ మోహిద్దిన్‌గా గుర్తించారు. తమిళనాడులో చిన్న పిల్లల ఆట వస్తువులు విక్రయించే వ్యాపారాన్ని నిర్వహించే మహమద్ మోహిద్దిన్ డబ్బులకు ఆశపడే బంగారు ఆభరణాలను అక్రమంగా తరలించాడినికి అంగీకరించినట్లు తమ విచారణలో తెలిసిందని అధికారులు తెలిపారు.
అయితే బంగారు ఆభరణాల అక్రమ రవాణకు ఎయిర్‌పోర్టుకు చెందిన సిబ్బంది కూడా మహమద్ మోహిద్దిన్‌కు సహకరించినట్లు సంబంధిత అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగారు బిస్కెట్లు విదేశాల నుంచి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఏఐయూ)అధికారులు అరెస్ట్ చేసారు. ఈ ఘటనలో రూ.2.60కోట్ల విలువ చేసే 6.65కేజీల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు.