
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ప్రయాణించే తమ యూజర్లు .. యూపీఐ మాధ్యమంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును ఆర్థిక సేవల సంస్థ పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, నేపాల్‌లోని నిర్దిష్ట ప్రాంతాల్లో దీన్ని వినియోగించుకోవచ్చని పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వెల్లడించింది.
షాపింగ్, డైనింగ్ సహా వివిధ అవసరాలకు చెల్లింపుల కోసం ఈ ఫీచరు ఉపయోగపడగలదని పేర్కొంది. రానున్న హాలిడే సీజన్‌లో తమ యూజర్లు మరింత సౌకర్యవంతంగా విదేశీ ప్రయాణాలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment