
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లోపనిచేసే ఉద్యోగులకు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) శుభవార్త అందించింది. విదేశాలకు వెళ్లి పనిచేసే భారతీయ ఉద్యోగులకు ఇకపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌వో భద్రతను, సౌకర్యాలను అందించనుంది. స్వల్పకాలం పాటు పనిచేసేందుకు ఇతర దేశాలకు వెళ్లేవారికి ఈ సౌకర్యం బాగా ఉపయోగపడనుంది. ఈ మేరకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహించే ఈపీఎఫ్‌వో 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
విదేశాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక ఆయా దేశాల్లో అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలను తామే మినహాయించుకుని ఈపీఎఫ్‌వోను ఎంచుకునే సౌలభ్యాన్ని ఈపీఎఫ్‌వో కల్పిస్తోందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జోయ్ శుక్రవారం తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో వ్యవస్థను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మొత్తం ప్రక్రియను సులభతరంగా సిద్ధం చేశామని చెప్పారు. పరిమిత కాల వ్యవధిలో విదేశీ ఉద్యోగాలకు భారత కార్మికులకు ఈ పథకం ఎంతో సహాయపడుతుందనీ ఎ వరైతే ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్తారో వారికి సర్టిఫికెట్ ఆఫ్ కవరేజీ (సీవోసీ)ని అందిస్తామని, దాన్ని పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఒక పేజీతో కూడిన దరఖాస్తు ఫారాన్ని ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు వెల్లడించారు. తద్వారా ఉద్యోగులు డబ్బు దీర్ఘకాలంపాటు విదేశాలకలో బ్లాక్ కాకుండా ఉంటుందంటూ పథకం ప్రయోజనాలను వివరించారు. ఇందుకు బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, కొరియా రిపబ్లిక్, నెదర్లాండ్స్, హంగేరీ, ఫిన్లాండ్, స్వీడన్, చెక్ రిపబ్లిక్, నార్వే, ఆస్ట్రియా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ , పోర్చుగల్ దేశాలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు.
ప్రపంచంలో ఉద్యోగులకు భద్రతను అందించే అతిపెద్ద సంస్థల్లో ఈపీఎఫ్‌వో ఒకటి. ఇందులో 9.26లో యజమానులతో పాటు, 4.5 కోట్ల మంది సభ్యులుగా ఉండగా, ప్రతి నెలా 60.32 లక్షల మంది
ఈపీఎఫ్‌వో ద్వారా పింఛన్లు అందుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment