న్యూఢిల్లీ: విద్య, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సోమవారం చెప్పారు. మందిర్ మార్గ్‌లోని నవ్‌యుగ్ పాఠశాలలో ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకొని 28 రోజులు గడిచిన వారు ఈ కేంద్రానికి వచ్చి రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు.
వచ్చేవారు తమ పాస్‌పోర్టులను, ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లేవారికి వేగంగా వ్యాక్సినేషన్ చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సెంటర్‌లో కోవిïÙల్డ్ వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు. ఆగస్టు 31లోగా వెళ్లేవారికి మాత్రమే ప్రస్తుతం వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి: పీఎం కేర్స్ నిధులతో 850 ఆక్సిజన్ ప్లాంట్లు
Delhi: విదేశాలకు వెళ్లేవారికి ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రం
Published Tue, Jun 15 2021 10:01 AM | Last Updated on Tue, Jun 15 2021 10:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment