మన మార్కెట్లు పడిపోతున్నాయి. విదేశాల్లో అయితే కాస్తంత స్థిరంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికోసం విదేశీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ గ్లోబల్ ఈక్విటీ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫండ్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని వివిధ దేశాలకు చెందిన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే గ్లోబల్ స్టేబుల్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆగస్టు 27న ప్రారంభమయ్యే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ సెప్టెంబర్ 10తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రూ.5,000గా నిర్ణయించారు. ఇది ఓపెన్ ఎండెడ్ పధకం కావడంతో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా వైదొలగవచ్చు. 90 రోజుల్లో వైదొలిగితే 3%, ఆ తర్వాత 540 రోజులలోపైతే 1% అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్‌ఎంఎస్‌తో రైల్వే బుకింగ్: ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్‌ఎంఎస్ ద్వారా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు 139 అనే నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేస్తే నేరుగా ఖాతా నుంచి నగదు తీసుకొని టికెట్లను జారీ చేయడం జరుగుతుంది.
విదేశాల్లో పెట్టుబడికి ఐసీఐసీఐ ఫండ్
Published Sun, Aug 25 2013 1:15 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement