సంకల్పం గట్టిగా ఉంటే.. సక్సెస్ కాళ్ల దగ్గరకు రావాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'అంబిక రైనా' (Ambika Raina). ఇంతకీ ఈమె ఎవరు ఈమె సాధించిన సక్సెస్ ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబిక రైనా మంచి శాలరీలు వచ్చే ఉద్యోగాలను సైత వదులుకుని, అనుకున్న విధంగా ఐఏఎస్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. అంబిక తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ కావడంతో చిన్నప్పటి నుంచే.. క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని నింపారు.
తండ్రి ఇండియన్ ఆర్మీ ఉద్యోగి కావడంతో చదువు వివిధ రాష్ట్రాల్లో సాగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్శిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీని పూర్తి చేసి.. ఆ తరువాత స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని ఒక కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ ఆఫర్‌తో పాటు ఇతర కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్‌లను కూడా పొందింది.
అందివచ్చిన ఉద్యోగాలను సైతం వదులుకుని ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో అటువైపుగానే అడుగులు వేసింది. మొదటి రెండు ప్రయత్నాలలో అనుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకోలేకపోయినప్పటికీ.. పట్టు వదలకు మూడవ సారి ఐఏఎస్ జాబ్ కొట్టేసింది.
ఇదీ చదవండి: లీటరు పెట్రోల్ రూ.450 - ఫిబ్రవరి నుంచి అమలు.. ఎక్కడంటే?
నిజానికి అబ్రాడ్‌లో ఉద్యోగమంటే చాలామంది ఎగిరి గంతేసి మరీ వెళ్ళిపోతారు. ఎందుకంటే కొందరు జీతమే లక్ష్యంగా పని చేస్తారు, మరి కొందరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అడుగులు వేస్తారు. ఈ విధంగా ముందుకు వెళ్లే క్రమంలో ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ, వాటన్నింటిని వదులుకుని ముందుకు వెళ్ళిపోతారు.
Comments
Please login to add a commentAdd a comment