న్యూఢిల్లీ: విజయ్ మాల్యాకు విదేశాల్లో ఉన్న ఆస్తుల సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సేకరించేక్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, తదితర దేశాలకు లెటర్స్ రొగటొరీస్(ఎల్‌ఆర్)ల జారీకి సిద్దమవుతోంది. యునెటైడ్ బ్రూవరీస్ చైర్మన్ మాల్యాకు కొన్ని దేశాల్లో ఉన్న చర, స్థిరాస్థి వివరాలను ఈడీ ఇప్పటికే సేకరించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐడీబీఐకి రూ. 900 కోట్ల రుణ ఎగవేత కేసులో యాంటీ మనీ ల్యాండరింగ్ చట్టాల ప్రకారం ఆస్తుల ఆటాచ్‌మెంట్‌కు అవసరమైన మాల్యా ఆస్తులు భారత్‌లో లేవని, అందుకే విదేశాల్లోని మాల్యా, కింగ్ ఫిషర్ ఆస్తులపై దృష్టిపెట్టినట్లు ఆ వర్గాలు వివరించాయి.
ఎందుకు పెరిగాయంటే...
1200 శాతం స్పెషల్ డివిడెండ్‌ను ప్రకటించిన నేపథ్యంలో హిందూస్తాన్ జింక్ దూసుకుపోయింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడింది. అమెరికాకు చెందిన స్ట్రెంగ్త్ ఆఫ్ నేచర్ ఎల్‌ఎల్‌సీ హెయిర్ కేర్ కంపెనీని కొనుగోలు చేయడంతో గోద్రేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ షేరు పెరిగింది.
ఎందుకు తగ్గాయంటే...
లోహాలను అధికంగా వినియోగించే చైనా అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలం స్థాయికి స్టాండర్డ్ అండ్ పూర్స్ సంస్థ తగ్గించడంతో వేదాంత, హిందాల్కో, ఎన్‌ఎండీసీ వంటి లోహ షేర్లు తగ్గాయి. ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను సుప్రీం కోర్ట్ పొడిగించడంతో డీజిల్ కార్లను అధికంగా తయారు చేసే మహీంద్రా అండ్ మహీంద్రా తగ్గింది. లుపిన్ గోవా ప్లాంటుపై అమెరికా ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ షేరు క్షీణ త కొనసాగుతోంది.