సాక్షి, ముంబై: వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా(63)కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న మాల్యా ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు పీఎంఎల్‌ఏ ముంబై కోర్టు అనుమతినిచ్చింది. రూ.13వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయనుంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఈ ఆస్తులను వేలం వేయనుంది. అయితే జనవరి 18 తరువాత మాత్రమే ఈ ఆదేశాలను పాటించాలని కూడా కోర్టు వెల్లడించింది. దీనిపై సంబంధిత పార్టీలు ఈ ఆదేశాలపై బొంబాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని పేర్కొంది. సీజ్ చేసిన ఆస్తుల లిక్విడేషన్‌కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గత ఏడాది ఫిబ్రవరిలో ఈడీకోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
కాగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా 2016 మార్చిలో లండన్‌కు పారిపోయాడు. 2017లో అరెస్ట్ అయిన ప్రస్తుతం బెయిల్‌మీద ఉన్నాడు. మాల్యాను భారత్‌కు రప్పించేదుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ చట్ట ప్రకారం మాల్యాను ఆర్థిక నేరస్తుడిగా పీఎంఎల్‌ఏ కోర్టు గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment