అసలే రాష్ట్రపతి పాలన, ఆపై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదివారం మహబూబ్‌నగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనే కారణం
మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ : అసలే రాష్ట్రపతి పాలన, ఆపై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదివారం మహబూబ్‌నగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం మహబూబ్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్, గద్వాలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి మాజీ మంత్రి డీకే.అరుణ హాజరై ప్రసంగించారు. అలాగే, వనపర్తి పట్టణంలో బహిరంగ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి జి.చిన్నారెడ్డితోపాటు, అభివృద్ధి పనులు మంజూరు చేయించానని పేపర్లో ప్రకటించిన ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అధికారులు ధ్రువీకరించారు. వారం రోజుల్లో వారిచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలుంటాయని వారు చెబుతున్నారు.