M. girija shankar
-
చార్జ్ ఇవ్వకుంటే సస్పెన్షనే..
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్ : కేజీబీవీ ప్రత్యేకాధికారులుగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొత్తగా నియామకమైన వారికి వెంటనే చార్జ్ ఇవ్వకుంటే సస్పెండ్ చేయాలని క లెక్టర్ ఎం.గిరిజాశంకర్ డీఈఓ, ఆర్వీఎం పీఓకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియామకమైన ఎస్ఓలకు బాధ్యతలు అప్పగించి డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారు పేరెంట్ డిపార్టుమెంట్‌కు వెళ్లాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన లెక్క చేయకుండా కోర్టులను ఆశ్రయిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అధికారులు చేసేది లేక గత నెల 28న 18 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారి నుంచి వివరణ రాకపోవడంతో మంగళవారం జరిగిన సమావేశంలో క లెక్టర్ ఎం.గిరిజాశంకర్ వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఆర్వీఎం అధికారులు రిలీవ్‌కాని వారి జాబితాను జిల్లా విద్యాదికారికి బుధవారం పంపించారు. రిలీవ్‌కాని ఉపాధ్యాయులు వీరే.. పి.వకుల మల్లిక, ఎస్ఓగా భూత్పూర్ కేజీబీవీలో పనిచేస్తున్నారు, ఎం.విజయ (దామరగిద్ద ), వి.రాధిక (కోయిల్‌కొండ కేజీబీవీ), ఎ.అంజమ్మ, (ఉప్పునుంతల) లతాదేవి,(బాలనగర్ ), ఎం.పద్మ (బిజినపల్లి) సత్యవాణి (నవాబ్‌పేట ), సి.వసంతలక్ష్మి(వనపర్తి ), ఎం.పుష్పలత (ఆమనగల్లు ), ఎన్.లావణ్య (బోంరాస్‌పేట ), ఎం.విద్యావతిదేవి (హన్వాడ), జయమ్మ(మిడ్జిల్ ), ఎం.భారతి(తలకొండపల్లి ), ఎస్.పద్మ(వంగూరు ), రాజేశ్వరమ్మ(అచ్చంపేట), సుజాత(ఫరూక్నగర్ ), టి. శ్రీలత(కల్వకుర్తి ), శశిరేఖ(తిమ్మాజిపేట). జాబితా అందిన వెంటనే చర్యలు..: రిలీవ్‌కాని వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారి నుంచి జవాబు ఇంకా రాలేదు. రిలీవ్‌కాని వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఆర్వీఎం నుంచి జాబితా అందలేదు. పరిశీలించి వెంటనే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటా. -చంద్రమోహన్,డీఈఓ, మహబూబ్‌నగర్ -
తక్షణం నివేదిక ఇవ్వండి
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: భూత్పూర్ మండల కేంద్రంగా జరుగుతున్న నా సిరకం విత్తనాల తయారీ, అమ్మకాలపై తక్షణమే నివేది క ఇవ్వాలని కలెక్టర్ ఎం. గిరిజాశంకర్ ఆదేశించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘విత్తు..రైతన్న చిత్తు’ శీర్షికన ప్రచు రితమైన కథనానికి స్పం దించిన కలెక్టర్ వ్యవసాయాధికారులపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో సోమవారం ఉదయాన్నే జడ్చ ర్ల సహాయ వ్యవసాయ సంచాలకురాలు నిర్మల, భూ త్పూర్ మండల వ్యవసాయాధికారిణి బ్యూలా భూత్పూర్ మండల పరిధిలో ఉన్న విత్తనాల తయారీ కంపెనీలపై దాడులు నిర్వహిం చారు. అడ్డాకుల మండల ఏఓ తన మండల పరిధిలోని విభా సీడ్స్‌ను తనిఖీ చేశారు. షాద్‌నగర్, జడ్చర్ల మండలాల పరిధిలో ఉన్న విత్తన కంపెనీలపై ఆయా మండలాల ఏఓలు తనిఖీలు జరిపి ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు తయారు చేశారు.. ఎన్నింటిని విక్రరుుంచారు అనే వివరాలను సేకరించి నివేదికలను తయారు చేశారు. ముందే లీకు? భూత్పూర్ మండల పరిధిలోని కంపెనీలపై దాడులు జరగనున్నట్లు కంపెనీల యాజమానులకు ముందే సమాచారం అందింది. దీంతో కంపెనీల యాజమానులు తెలివిగా సోమవారం తమ కంపెనీలకు సెలవు ప్రకటించి, పనులకు పుల్‌స్టాప్ పెట్టారు. దీంతో పాటు విత్తనాల ప్యాకెట్లు, ముడి విత్తనాలను గోదాంలో దాచి ఉంచారు. కంపెనీల యాజమానులు అనుకున్నట్లుగానే అధికారులు మొక్కుబడిగా తనిఖీ చేసి వెళ్లిపోవడంతో కంపెనీల యాజమానులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా అమిస్తాపూర్‌లోని ఓ కంపెనీ గుజరాత్ రాష్ట్రంలోని ఓ చిరునామాతో కల్పవృక్ష అనే బీటీ విత్తనాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల రాక అందుకున్న ఆ కంపెనీ యజమాని వాటిని హుటాహుటిన వేరే చోటుకు తరలించినట్లు సమాచారం. జడ్చర్ల అడ్రస్‌తో లెసైన్స్ పొంది భూత్పూర్లో నిర్వహిస్తోన్న మరో కంపెనీ యజ మాని కూడా అధికారుల రాక తెలుసుకొని వేరే చోటుకు విత్తనాలను తరలించినట్లు తెలిసింది. కాగా అధికారులు విత్తనాల తయారీ కంపెనీల గోదాంలను కానీ, ప్యాకిం గ్ పాయింట్లను కానీ తనిఖీ చేసిన దాఖలాలు కనిపించలేదు. ఏదో మొక్కబడిగా తనిఖీలు జరిపి ఏమీ తేల్చకుండానే వెనుదిరిగారు. నాసిరకం విత్తన తయారీదారులపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎక్కడైనా నాసి రకం విత్తనాలు తయారు చేసినా, అమ్మినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విత్తన కంపెనీలను పరిశీలించి, వాటిపై నివేది క సమర్పించాలని ఇప్పటికే అధికారులకు సూచించాం. నివేదిక ఆధారంగా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి నుంచి ఆయా కంపెనీలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. - జేడీఏ భగవత్ స్వరూప్ -
‘స్వీప్’తో పెరిగిన పోలింగ్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటు హక్కు వినియోగంపై చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్లే పోలింగ్ నమోదుశాతం పెరిగిందని కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ తెలిపారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం, నైతిక ఓటుపై చేపట్టిన స్వీప్ కార్యక్రమాలు మంచి ఫలితాన్నిచ్చాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా 75.5 శాతం పోలిం గ్ నమోదు కావడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ నెల 6న నిర్వహిం చిన మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కూడా బాగా నమోదైందని తెలిపారు. మొదటి విడ త 12 లక్షల 55 వేల 180 మంది ఓటర్ల కు గాను 9 లక్షల 93 వేల 264 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకొన్నారని పేర్కొన్నారు. అటవీ ప్రాంతమైన అచ్చంపేటలో 84.41 శా తం, బల్మూరులో 75.10 శాతం, కొల్లాపూర్‌లో 79.57 శాతం, ఉప్పునుంతలలో 82.05 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ వివరించారు. అలాగే గద్వాల డివిజన్లోని అన్ని మండలాలలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతాలైన కల్వకుర్త్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో పోలింగ్‌ను ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు ఎన్నికల విధులకు గైర్హాజరైతే సస్పెండ్ పాలమూరు: సాధారణ ఎన్నికల విధులకు నియమించిన ఉద్యోగులు గైర్హాజరైతే సస్పెండ్ చేసేందుకు సంబంధిత శాఖాధికారులు సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి గిరిజాశంకర్ సూచించారు. ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి కొందరు పీఓ, ఏపీఓలు హాజరుకాలేదని, కొంతమంది ఉత్తర్వులు కూడా తీసుకోలేదన్నారు. 9న నిర్వహించే శిక్షణకు హాజరు కావాలని లేదంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఏఎన్ఎంను అభినందించిన కలెక్టర్ మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అనారోగ్యం తో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన మహిళా ఓటరుకు ప్రథమ చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన ఏఎన్ఎం రేణుకాదేవిని కలెక్టర్ అభినందించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ధరూర్ మండలం గోన్పాడులోని 11, 12 పోలింగ్ కేంద్రంలో ఒక మహిళా ఓటరు సొమ్మసిల్లి పడిపోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం రేణుకాదేవి స్పందించి మహిళకు ఓఆర్ఎస్ ద్రావణం అందించి ప్రథమ చికిత్స నిర్వహించి ప్రాణాలు నిలిపినందుకుగాను కలెక్టర్ అభినందించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇతర ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు బాగా పనిచేసి మంచిపేరు పొందాలని కోరారు. -
ఇద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనే కారణం మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ : అసలే రాష్ట్రపతి పాలన, ఆపై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదివారం మహబూబ్‌నగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం మహబూబ్‌నగర్‌లోని బృందావన్ గార్డెన్, గద్వాలలో మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశానికి మాజీ మంత్రి డీకే.అరుణ హాజరై ప్రసంగించారు. అలాగే, వనపర్తి పట్టణంలో బహిరంగ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి జి.చిన్నారెడ్డితోపాటు, అభివృద్ధి పనులు మంజూరు చేయించానని పేపర్లో ప్రకటించిన ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అధికారులు ధ్రువీకరించారు. వారం రోజుల్లో వారిచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలుంటాయని వారు చెబుతున్నారు. -
‘హెలెన్’ ముప్పు ఉంది.. అప్రమత్తంగా ఉండండి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు హెలెన్ తుపాన్ వచ్చే ప్రమాదం ఉందని, జిల్లావాసులను అప్రమత్తం చేయాల్సిందిగా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు. జిల్లాకు హెలెన్ ముప్పు ఉందని వాతావరణ ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన రెవెన్యూ, పంచాయతీ రాజ్, మెడికల్, విద్యుత్, నీటిపారుదల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కంటే అతి భారీ వ ర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలుల వల్ల చెట్లు కూలి రహదారులపై పడి ట్రాఫిక్ అంతరాయం కలగవచ్చని, అలాంటి పరిస్థితులు ఏర్పడితే వెంటనే సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పూరి గుడిసెలు, పాత ఇండ్లు ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. పాత భవనాలు ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని సూచించారు. రోడ్లపై ఆరబెట్టుకుంటున్న ధాన్యాన్ని రైతులు వెంటనే ఇళ్లలోకి తీసుకెళ్లేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే చాలావరకు జిల్లాలో చెరువులు నీటితో సమృద్ధిగా ఉన్నాయని, ఇప్పుడు వర్షాలు పడితే అవి పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అవసరమయ్యే మందులు సిద్ధం చేసుకుని, ప్రజలకు సకాలంలో అందించాలన్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలితే, ప్రాణనష్టం జరగకుండా విద్యుత్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశామని, దానికి 08542-245377నంబర్ని కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యలుంటే ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్‌కి తెలియ జేస్తూ, సమస్యను అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎల్.శర్మణ్, డీఆర్వో రాంకి షన్, డీపీఓ రవీందర్, ఆర్డీఓ హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.