చార్జ్ ఇవ్వకుంటే సస్పెన్షనే..
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్ : కేజీబీవీ ప్రత్యేకాధికారులుగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొత్తగా నియామకమైన వారికి వెంటనే చార్జ్ ఇవ్వకుంటే సస్పెండ్ చేయాలని క లెక్టర్ ఎం.గిరిజాశంకర్ డీఈఓ, ఆర్వీఎం పీఓకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియామకమైన ఎస్‌ఓలకు బాధ్యతలు అప్పగించి డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారు పేరెంట్ డిపార్టుమెంట్‌కు వెళ్లాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన లెక్క చేయకుండా కోర్టులను ఆశ్రయిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
దీంతో అధికారులు చేసేది లేక గత నెల 28న 18 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారి నుంచి వివరణ రాకపోవడంతో మంగళవారం జరిగిన సమావేశంలో క లెక్టర్ ఎం.గిరిజాశంకర్ వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఆర్వీఎం అధికారులు రిలీవ్‌కాని వారి జాబితాను జిల్లా విద్యాదికారికి బుధవారం పంపించారు.
రిలీవ్‌కాని ఉపాధ్యాయులు వీరే..
పి.వకుల మల్లిక, ఎస్‌ఓగా భూత్పూర్ కేజీబీవీలో పనిచేస్తున్నారు, ఎం.విజయ (దామరగిద్ద ), వి.రాధిక (కోయిల్‌కొండ కేజీబీవీ), ఎ.అంజమ్మ, (ఉప్పునుంతల) లతాదేవి,(బాలనగర్ ), ఎం.పద్మ (బిజినపల్లి) సత్యవాణి (నవాబ్‌పేట ), సి.వసంతలక్ష్మి(వనపర్తి ), ఎం.పుష్పలత (ఆమనగల్లు ), ఎన్.లావణ్య (బోంరాస్‌పేట ), ఎం.విద్యావతిదేవి (హన్వాడ), జయమ్మ(మిడ్జిల్ ), ఎం.భారతి(తలకొండపల్లి ), ఎస్.పద్మ(వంగూరు ), రాజేశ్వరమ్మ(అచ్చంపేట), సుజాత(ఫరూక్‌నగర్ ), టి. శ్రీలత(కల్వకుర్తి ), శశిరేఖ(తిమ్మాజిపేట).
జాబితా అందిన వెంటనే చర్యలు..:
రిలీవ్‌కాని వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశాం. వారి నుంచి జవాబు ఇంకా రాలేదు. రిలీవ్‌కాని వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఆర్వీఎం నుంచి జాబితా అందలేదు. పరిశీలించి వెంటనే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటా.
-చంద్రమోహన్,డీఈఓ, మహబూబ్‌నగర్