అవినీతికి పాల్పడుతున్న జిల్లా విద్యా శాఖ అధికారిని సస్పెండ్ చేయాలంటూ బుధవారం ఉపాధ్యాయ సంఘాలు రోడ్డుకెక్కాయి.
అవినీతికి పాల్పడుతున్న జిల్లా విద్యా శాఖ అధికారిని సస్పెండ్ చేయాలంటూ బుధవారం ఉపాధ్యాయ సంఘాలు రోడ్డుకెక్కాయి. తనిఖీల పేరుతో డీఈవో ప్రతి పాఠశాల నుంచి రూ 10వేల నుంచి రూ.20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన వారు.. డీఈవో పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన టీచర్లు పాల్గొన్నారు.