కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటు హక్కు వినియోగంపై చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్లే పోలింగ్ నమోదుశాతం పెరిగిందని కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ తెలిపారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం, నైతిక ఓటుపై చేపట్టిన స్వీప్ కార్యక్రమాలు మంచి ఫలితాన్నిచ్చాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా 75.5 శాతం పోలిం గ్ నమోదు కావడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ నెల 6న నిర్వహిం చిన మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కూడా బాగా నమోదైందని తెలిపారు.
మొదటి విడ త 12 లక్షల 55 వేల 180 మంది ఓటర్ల కు గాను 9 లక్షల 93 వేల 264 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకొన్నారని పేర్కొన్నారు. అటవీ ప్రాంతమైన అచ్చంపేటలో 84.41 శా తం, బల్మూరులో 75.10 శాతం, కొల్లాపూర్‌లో 79.57 శాతం, ఉప్పునుంతలలో 82.05 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ వివరించారు. అలాగే గద్వాల డివిజన్‌లోని అన్ని మండలాలలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైందని తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతాలైన కల్వకుర్త్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో పోలింగ్‌ను ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు
ఎన్నికల విధులకు గైర్హాజరైతే సస్పెండ్
పాలమూరు: సాధారణ ఎన్నికల విధులకు నియమించిన ఉద్యోగులు గైర్హాజరైతే సస్పెండ్ చేసేందుకు సంబంధిత శాఖాధికారులు సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి గిరిజాశంకర్ సూచించారు. ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి కొందరు పీఓ, ఏపీఓలు హాజరుకాలేదని, కొంతమంది ఉత్తర్వులు కూడా తీసుకోలేదన్నారు. 9న నిర్వహించే శిక్షణకు హాజరు కావాలని లేదంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.
ఏఎన్‌ఎంను అభినందించిన కలెక్టర్
మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అనారోగ్యం తో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన మహిళా ఓటరుకు ప్రథమ చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన ఏఎన్‌ఎం రేణుకాదేవిని కలెక్టర్ అభినందించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ధరూర్ మండలం గోన్‌పాడులోని 11, 12 పోలింగ్ కేంద్రంలో ఒక మహిళా ఓటరు సొమ్మసిల్లి పడిపోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎం రేణుకాదేవి స్పందించి మహిళకు ఓఆర్‌ఎస్ ద్రావణం అందించి ప్రథమ చికిత్స నిర్వహించి ప్రాణాలు నిలిపినందుకుగాను కలెక్టర్ అభినందించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇతర ఏఎన్‌ఎంలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు బాగా పనిచేసి మంచిపేరు పొందాలని కోరారు.
‘స్వీప్’తో పెరిగిన పోలింగ్
Published Tue, Apr 8 2014 3:54 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement