జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న మొదటి విడతగా 21 మండలాల్లో, రెండో విడతగా ఏప్రిల్ 11న 31 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న మొదటి విడతగా 21 మండలాల్లో, రెండో విడతగా ఏప్రిల్ 11న 31 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అహ్మద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
అయితే పోలింగ్ ఏప్రిల్ 6న ఆసిఫాబాద్, బెజ్జూర్, భీమిని, దహెగాం, కాగజ్‌నగర్, కౌటాల, రెబ్బెన, సిర్పూర్(టి), తాండూర్, బెల్లంపల్లి, చెన్నూర్, దండేపల్లి, జైపూర్, జన్నారం, కాసిపేట, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడుతగా ఏప్రిల్ 11న ఆదిలాబాద్, బజార్‌హత్నూర్, బేల, బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, జైనథ్, నేరడిగొండ, తలమడుగు, తాంసి, భైంసా, దిలావర్‌పూర్, కడెం, ఖానాపూర్, కుభీర్, కుంటాల, లక్ష్మణచాంద, లోకేశ్వరం, మామడ, ముధోల్, నిర్మల్, సారంగపూర్, తానూర్, ఇంద్రవెల్లి, జైనూర్, కెరమెరి, నార్నూర్, సిర్పూర్(యు), తిర్యాణి, ఉట్నూర్, వాంకిడి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.