ఏపీలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి మళ్లీ విధింపు! | Centre may circumvent ratification of President rule in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి మళ్లీ విధింపు!

Published Tue, Apr 22 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

Centre may circumvent ratification of President rule in Andhra pradesh

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1న విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్రం ఉపసంహరించి ఆపై వెంటనే తిరిగి విధించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోగా ఆ నిర్ణయాన్ని తప్పనిసరిగా ఆమోదించేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసేందుకు మరో రెండు నెలల సమయం లభిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటం, ఎంపీలంతా ఎన్నికల ప్రచారంలో తలమునకలు కావడంతో కేవలం రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపేందుకే పార్లమెంటును సమావేశపరచడం కష్టమని...అందుకే ఈ చర్యకు అవకాశం కల్పించే రాజ్యాంగంలోని నిబంధనను కేంద్రం ఉపయోగించుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement