జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2019ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుతోపాటు జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగించే తీర్మానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకొని బిల్లుకు, తీర్మానానికి రాజ్యసభ మద్దతు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.