
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దురదృష్టకరం
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.
ప్రకాశం: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన రెండూ దురదృష్టకరమని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన బాలినేని.. కాంగ్రెస్ పార్టీని దివంగత నేత వైఎస్సార్ రెండుసార్లు అధికారంలోకి తెస్తే అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావడం కాంగ్రెస్ కే సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెపుతారని విమర్శించారు.