జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పేలా లేదు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై గవర్నర్ ఓహ్రా కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు. అత్యధిక స్థానాలు సాధించిన పీడీపీ, ఆ తర్వాతి స్థానంలో ఉన్న బీజేపీల మధ్య ఇంకా ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి అవగాహన కుదరని విషయం తెలిసిందే.
తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలించే పరిస్థితులు లేకపోతే.. రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ఓహ్రా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి పాలన తప్పదా?
Published Thu, Jan 8 2015 7:37 PM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM
Advertisement
Advertisement