సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ నేతలు ప్రతీరోజు కేంద్రంలోని బీజేపీ, దర్యాప్తు సంస్థలతో తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆప్ మంత్రి అతిశి సంచలన కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి అతిశి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం కుట్రలు జరుగుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. గతంలోని అనుభవాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ.. అధికారులను కేటాయించడం లేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన నాటి నుంచి అధికారులు సమావేశాలకు హాజరుకావడం మానేశారు. ఈ కుట్రలో భాగంగానే సీఎం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్)ని పదవి నుంచి తొలగించారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
#WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Let me warn the BJP that imposing President's rule in Delhi will be illegal, unconstitutional and against the mandate of the people of Delhi. The people of Delhi have given a clear mandate to Arvind Kejriwal and Aam Aadmi Party." pic.twitter.com/IbcVTnpkNK
— ANI (@ANI) April 12, 2024
దీంతో, మంత్రి అతిశి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రతిరోజు కొన్ని అందమైన కథల్ని వండి వార్చుతున్నారని కాషాయ పార్టీ నేతలు ఎద్దేవా చేసింది. ఇక, ఆప్ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా.. సీఎం పీఎస్ వైభవ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగం ప్రకటించింది. కాగా, ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది.
#WATCH | Delhi Minister & AAP leader Atishi says, "Arvind Kejriwal has been arrested in a fake case and that too without any proof because there is a conspiracy to topple the elected govt of Delhi. when we see a few things from the past, it shows that there has been a… pic.twitter.com/kcGcqRIpde
— ANI (@ANI) April 12, 2024
Comments
Please login to add a commentAdd a comment