అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ సంక్షోభంపై సుప్రీంకోర్టు బుధవారం చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలన్నింటినీ న్యాయస్థానం రద్దు చేసింది. అసెంబ్లీ సమావేశాల తేదీని ముందుకు జరుపుతూ.... గవర్నర్ తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. డిసెంబర్ 15, 2015 నాటి యథాతథ పరిస్థితి ఉండాలని సూచించింది