రాష్ట్రపతి పాలనలో కీలకంగా సలహాదారులు | Advisors play key role During the President rule | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పాలనలో కీలకంగా సలహాదారులు

Published Wed, Mar 5 2014 6:12 PM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

Advisors  play  key role During the President rule

హైదరాబాద్: రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్‌ సలహాదారులు కీలకంగా ఉంటారు. గవర్నర్ సలహాదారుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు.  ఆంధ్రా క్యాడర్‌ 1969 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి అనుగ్రహ నారాయణ్‌ తివారి పేరును పరిశీలిస్తున్నారు. కృష్ణకాంత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న సమయంలో  తివారి సెక్రటరీగా పనిచేశారు. ఆయన గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ పర్సనల్‌ సెక్రటరీగా కూడా  పనిచేశారు.

గవర్నర్‌ మరో సలహాదారుగా మాజీ ఐపీఎస్‌ విజయ్‌కుమార్‌ పేరును కూడా పరిశీలిస్తున్నారు.  ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రత సలహాదారుగా ఆయన ఉన్నారు.  విభజన విషయంలోనూ ఆయన  సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్‌ వీరప్పన్‌ కేసుతో విజయ్‌కుమార్‌ వెలుగులోకి వచ్చారు.  మాజీ ఐఏఎస్‌ అధికారి పి.సి.పరేఖ్‌ పేరును కూడా పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement