కుందుర్పి (అనంతపురం) :రాష్ట్రప్రభుత్వం పెంచిన విధ్యుత్తు చార్జీలకు నిరసనగా గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులు కుందుర్పిలో ర్యాలీ మరియు రెవిన్యూకార్యాలయం ముందు ధర్నా చేపట్టి ఆంధోళన చేపట్టారు.స్థానిక రామస్వామి ఆలయం నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు స్థానిక రెవిన్యూకార్యాలయం ముందు రెండుగంటలపాటు ధర్నా నిర్వహించారు.కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపి ప్రదాన కార్యాలయానికి తాళాలు వేసి బైటాయించి నిరసన తెలిపారు.అనంతరం మండల కన్వినర్ ఎస్‌కేఆంజినేయులు మరియు నాయకులు నరేష్,రామూర్తి,ఎన్‌బాబు,ఈరాము తదితరులు మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టిన 9నెలలు కాలంలోనే ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని రుణమాఫీ,పండ్లతోటల బిల్లులు,ఫించన్లు,తదితర పథకాలను అమలుచేయకపోగా రోజూ ప్రజలకు అపద్దప్రకటనలతో సీఎం చంద్రబాబు ముందుకుసాగుతున్నారని తెలిపారు.
వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పాలనలో రూపాయి విధ్యుత్తు చార్జీలు పెంచకుండా రైతులకు మరియు సామాన్యప్రజల అభివృధ్దికి బాటలు వేశారని సీఎం చంద్రబాబు మాత్రం ఏడాది గడువక ముందే విధ్యుత్తు చార్జీలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపారన్నారు.అనంతరం ఏపీఓ నీరజను అక్కడకు చేరుకున్న నాయకులు పలువురు ఉపాదికూలీలు బిల్లులు చెల్లించాలని నిలదీశారు.ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్దప్పయ్య, అతావుల్లా, పాలాక్షి, బండారప్ప, స్టుడియో కిష్ట, తిమ్మ రాజు, ఎనుముల దొడ్డిరాముడు, పూలరామాంజి, మల్లి, శివలింగమూర్తి, శ్రీనివాసులు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీల పెంపుపై ఆగ్రహం
Published Thu, Mar 26 2015 8:38 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement