సాక్షి, అమరావతి: అసలు వాస్తవాలను దాచిపెట్టేసి, అవాస్తవాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు నిత్యకృత్యంగా పెట్టుకుంది. ఏదో ఒక కారణంగా విద్యుత్తు బాదుడంటూ తరచూ తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. విద్యుత్ ట్రూఅప్ చార్జీలపై బుధవారం ఈనాడు ప్రచురించిన కథనమూ ఇటువంటిదే. అసలు వాస్తవమేమిటంటే.. ఈ ట్రూఅప్ చార్జీలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనివే. ఆ విషయం ప్రసావించకుండా కథనం వండి, పాఠకులను వంచించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం విధిస్తున్న నెట్‌వర్క్ ట్రూ ఆప్ చార్జీలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనివని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు స్పష్టం చేశారు. 2014–19 మధ్య కాలంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ నిమిత్తం జరిగిన వాస్తవ ఖర్చులు నిర్దేశిత వ్యయంకన్నా ఎక్కువ అవడంవల్ల ఈ చార్జీలు వచ్చాయే తప్ప ప్రస్తుత కాలానికి సంబంధించినవి కావని తెలిపారు. ఈ వాస్తవాలను దాచిపెట్టి ‘విద్యుత్ చార్జీలపై జగన్ వంచన’ అంటూ ఈనాడు బుధవారం అచ్చేసిన కథనాన్ని సీఎండీలు ఖండించారు. ఈ మేరకు ‘సాక్షి’ ప్రతినిధికి వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల నిర్ధారణకు 1998 సంవత్సరంలోనే రాష్ట్ర విద్యుత్ సంస్కరణల చట్టం ప్రకారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఏర్పాటైంది. విద్యుత్ నెట్‌వర్క్, రిటైల్ సరఫరా ధరలను చట్టబద్ధంగా ఏర్పాటైన ఏపీఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఇందుకోసం డిస్కంల ఆర్థిక స్థితిగతులు, సరఫరా, నెట్‌వర్క్ నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చు, దీర్ఘకాలంలో వివిధ ఖర్చుల వార్షిక పెరుగుదల శాతంలను పరిగణనలోకి తీసుకుంటుంది. రాష్ట్ర విద్యుత్ రంగంలో నెట్‌వర్క్ నిర్వహణ ధరలు ఐదేళ్లకొకసారి, రిటైల్ సరఫరా ధరలు ఏడాదికోసారి ఆరి్ధక సంవత్సరం మొదలయ్యే ముందుగా ప్రకటిస్తారు. 2000 సంవత్సరం నుంచి రిటైల్ సరఫరా ధరలు, నెట్‌వర్క్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు వంటివి మండలి ఆదేశాల ప్రకారమే డిస్కంలు వినియోగదారుల నుంచి వారి వినియోగాన్ని బట్టి వసూలు చేస్తున్నాయి.
â విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి ఏటా సెపె్టంబరు నెలాఖరుకి తదుపరి ఆర్థిక సంవత్సరం ఆదాయ, అవసరాల నివేదికలను అప్పటికున్న పరిస్థితుల ఆధారంగా తయారు చేస్తాయి. అప్పుడు వంద శాతం ఖచి్చతత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయం అంచనా వేయడం సాధ్య పడదు. ఆరి్థక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంధన ఛార్జీలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో ఉండే హెచ్చుతగ్గులు విద్యుత్ చట్టంలో, నిబంధనల్లో నిర్దేశించిన విధంగా సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది.
â గడిచిన ఆరి్థక సంవత్సరంలో గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్‌ను హేతుబదీ్ధకరించి ఒక ఉమ్మడి ఏక గ్రూపు టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మొదటి స్లాబ్ రాయితీ ధరల ప్రయోజనం వినియోగదారులందరికీ అందుతుంది. ఇదే కాకుండా ప్రస్తుత ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ వాడకపోయినా కట్టవలసివచ్చే నెలవారీ కనీస చార్జీలు రద్దయ్యాయి. దీని ప్రకారం సింగల్ ఫేజ్ వారికి రూ.65, త్రీ ఫేజ్ వినియోగదారులకు రూ.150 చెల్లించాల్సిన అవసరం తప్పింది.
â కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగానే 2021–22 ఆరి్ధక సంవత్సరం నుండి వార్షిక ట్రూ ఆప్ చార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు చార్జీలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారమే డిస్కంలు 2021–22 సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి విద్యుత్ కొనుగోలు వ్యయ హెచ్చు తగ్గులను ఏపీఈఆర్‌సీకి సమరి్పంచాయి. ప్రస్తుత 2023–24 ఆరి్ధక సంవత్సరం నుంచి త్రైమాసిక సర్దుబాటు చార్జీల స్థానంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా నెలవారీ సర్దుబాటు చార్జీలు అమల్లోకి వచ్చాయి. తదనుగుణంగా డిస్కంలు జూన్ నుంచి నెలవారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ఒక నెలలోని సర్దుబాటును దాని తరువాత రెండో నెలలో వసూలు చేస్తారు.
â డిస్కంల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 2019 మే నుండి సెపె్టంబర్ 2023 వరకు సబ్సిడీ రూపంలో దాదాపు రూ.39,900 కోట్లను, వివిధ విభాగాల విద్యుత్ వినియోగ చార్జీల రూపంలో మరో రూ.10,750 కోట్లను, మొత్తంగా నాలుగున్నరేళ్లలో రూ.50,650 కోట్లు డిస్కంలకు ఇచి్చంది. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి ట్రూ ఆప్ చార్జీలను, ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. అందువల్ల ఇందులో వంచన అన్నదే లేదు. ఈనాడు కథనంలో అర్ధం లేదు.
Comments
Please login to add a commentAdd a comment